Watch Video: ‘అంపైర్ కిల్లర్’ బాల్‌ని చూశారా? తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వైరలవుతోన్న వీడియో
T20 World Cup 2021, PAK vs AUS:ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన ఐసీసీ అంపైర్ క్రిస్ గఫానీ కొద్దిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
T20 World Cup 2021, PAK vs AUS: ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో రెండో సెమీఫైనల్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన ఐసీసీ అంపైర్ క్రిస్ గఫానీకి పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం, నవంబర్ 11న జరిగిన ఫైనల్ టికెట్ మ్యాచులో పాకిస్థాన్ బ్యాటర్ ఫకర్ జమాన్ కొట్టిన ఓ బంతి నేరుగా అంపైర్ మీది నుంచి బౌండరీకి వెళ్లింది. అయితే ఏమాత్రం అంపైర్ తప్పుకోకున్నా భారీ ప్రమాదం జరిగేదే. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ వేసిన డెత్ ఓవర్‌లో, జమాన్ తన స్లాట్‌లో ఒక బంతిని వేగంగా బౌండరీ తరలించాడు.
బంతి నేరుగా అంటే అంపైర్ గఫానీ తల మీదుగా వెళ్లింది. క్షణాల్లోనే సమయస్ఫూర్తిచూపించిన గఫానీ వెంటనే తప్పుకున్నాడు. లేదంటే అంపైర్ తలకు బాల్ వేగంగా తలిగేదే. బంతిని గమనించిన గఫానీ వెంటనే కింద పడిపోయాడు. ఈ వీడియోను చూసిన వ్యాఖ్యాత బాజిద్ ఖాన్ ఆ షాట్‌ను ‘అంపైర్ కిల్లర్’గా అభివర్ణించారంటే అర్థం చేసుకోవచ్చు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. ఫఖర్, మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ అర్ధ సెంచరీలు చేశారు. రిజ్వాన్ 52 బంతుల్లో 67 పరుగులు, ఫఖర్ జమాన్ 32 బంతుల్లో 55 పరుగులు చేశారు. కెప్టెన్ బాబర్ ఆజం కూడా 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్.. 30 బంతుల్లో 49 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. గ్లెన్ మాక్స్‌వెల్ కూడా కేవలం 7 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే సమయంలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ 0, స్టీవ్ స్మిత్-5, మిచెల్ మార్ష్ 28 పరుగులు చేశారు. షాదాబ్ ఖాన్ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి కంగారూ జట్టును కష్టాల్లో పడేశాడు. కానీ, చివర్లో స్టోయినీస్ 40(31 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు), మాథ్యూ వాడే 41(17 బంతులు, 2 ఫోర్లు, 4 సిక్సులు) అద్భుత ఆటతీరుతో పాకిస్తాన్ విజయగర్వాన్ని అణిచివేసి ఆస్ట్రేలియాను ఫైనల్ చేర్చారు.
Fakhar Zaman definitely wanted the Umpire’s head on a silver platter! ?? #T20WorldCup pic.twitter.com/n2D3VMu6HQ
— Kuda Jr (@kudaville) November 11, 2021