చిన్నతనంలో షాహీన్ అఫ్రిది ఆటలన్నీ ఆడేవాడు. వాటిలో ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ ఇలా ఎన్ని ఆడినా.. అతనికి క్రికెట్ మాత్రం చాలా ఇష్టమైనది. అనేక ఇతర పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ల మాదిరిగానే, షాహీన్ కూడా తన చిన్నతనంలో టేప్ బాల్ క్రికెట్ ఆడేవాడు. దీంతో యార్కర్లు వేయడంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. షహీన్‌కు క్రికెట్‌లో కుటుంబం నుంచి పూర్తి సహకారం లభించింది. ఒకసారి పాఠశాలలో ఉపాధ్యాయుడు షాహీన్, అతని సోదరుడు ఒకే జట్టులో ఆడవచ్చని చెప్పారు. షాహీన్ మరొక సోదరుడు అతని కంటే వేగంగా బౌలింగ్ చేసేవాడు. కానీ, షహీన్ మ్యాచ్ రోజు పాఠశాలకు వెళ్లవద్దని అతనిని ఒప్పించాడు. అప్పుడు షహీన్ మాత్రమే ఆడాడు.