Watch Video: క్రికెట్‌లోనే అత్యంత చెత్త బంతి.. భారీ సిక్సర్ కొట్టి పాక్ బౌలర్‌కు షాకిచ్చిన డేవిడ్ వార్నర్.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..!
T20 World Cup 2021, PAK vs AUS: మహ్మద్ హఫీజ్ తన స్పెల్‌లోని మొదటి బంతికే భారీ తప్పిదం చేశాడు. దీంతో పాకిస్తాన్ జట్టుకు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు.
T20 World Cup 2021, PAK vs AUS: టీ20 ప్రపంచ కప్ 2021 సెమీ-ఫైనల్స్‌లో, పాకిస్థాన్‌కు చెందిన అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు మహ్మద్ హఫీజ్.. కీలక మ్యాచులో చిన్నపిల్లాడి లాంటి ఓ తప్పు చేయడం క్రికెట్ అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత అంపైర్‌తో వాగ్వాదానికి దిగడం గమనార్హం. నిజానికి 8వ ఓవర్లో మహ్మద్ హఫీజ్ బౌలింగ్‌లో చాలా చెడ్డ బంతిని వార్నర్ సిక్సర్‌గా బాదాడు. హఫీజ్ చేసిన ఈ పొరపాటు చూసి పాకిస్తాన్ ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారు.
8వ ఓవర్లో మహ్మద్ హఫీజ్ ధాడికి దిగాడు. రెండో బౌలింగ్‌లో డ్యూ కీలక పాత్ర పోషించడంతో స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం కష్టంగా మారింది. అయితే బంతి హఫీజ్ చేతిని వదిలి మిడిల్ పిచ్‌పై రెండు స్టెప్పులు పడుతూ వైడ్‌గా వెళ్లబోయింది. దీంతో ఎలాగైన ఆ బంతిని బాదాలనుకున్న డేవిడ్ వార్నర్.. ఆ బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదేశాడు. వార్నర్ కొట్టిన ఈ షాట్ తర్వాత హఫీజ్ అంపైర్‌తో వాగ్వాదం ప్రారంభించాడు. బంతి తన చేతి నుంచి జారిపోయిందని, అందుకే ఈ బంతిని డెడ్‌గా ప్రకటించాలని, అయితే ఆ నిర్ణయం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. అయితే అంపైర్ మాత్రం ఈ బంతిని ‘నో బాల్’ అని ప్రకటించి బౌలర్‌కు షాక్ ఇచ్చాడు.
వార్నర్ హాఫ్ సెంచరీ కోల్పోయాడు.. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్.. అతను 30 బంతుల్లో 49 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వార్నర్ నాటౌట్ అయినప్పటికీ షాదాబ్ ఖాన్ వికెట్ కోల్పోయాడు. షాదాబ్ వేసిన బంతికి రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. కానీ, బంతి బ్యాట్ అంచుకు చేరలేదు. ఆశ్చర్యకరంగా వార్నర్ స్వయంగా పెవిలియన్ వైపు వెళ్లాడు. అంటే బంతి తన బ్యాట్ అంచున పడిందని అతను భావించాడు కానీ అది జరగలేదు. వార్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ఆస్ట్రేలియాకు భారమైంది. అతని తర్వాత, గ్లెన్ మాక్స్‌వెల్ కూడా కేవలం 7 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే సమయంలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ 0, స్టీవ్ స్మిత్-5, మిచెల్ మార్ష్ 28 పరుగులు చేశారు. షాదాబ్ ఖాన్ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి కంగారూ జట్టును కష్టాల్లో పడేశాడు. కానీ, చివర్లో స్టోయినీస్ 40(31 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు), మాథ్యూ వాడే 41(17 బంతులు, 2 ఫోర్లు, 4 సిక్సులు) అద్భుత ఆటతీరుతో పాకిస్తాన్ విజయగర్వాన్ని అణిచివేసి ఆస్ట్రేలియాను ఫైనల్ చేర్చారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. ఫఖర్, మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ అర్ధ సెంచరీలు చేశారు. రిజ్వాన్ 52 బంతుల్లో 67 పరుగులు, ఫఖర్ జమాన్ 32 బంతుల్లో 55 పరుగులు చేశారు. కెప్టెన్ బాబర్ ఆజం కూడా 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
— Shaun (@ShaunakCric) November 11, 2021
Also Read: T20 world cup 2021: పాక్‌ను చిత్తు చేసిన కంగారూలు.. పాకిస్థాన్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా..