T20 World Cup 2021: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆసీస్ అద్భుత విజయం.. పాకిస్తాన్ ఓటమి..
T20 world cup 2021: పాకిస్తాన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. చివర్లో స్టోయినిస్..
T20 world cup 2021: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. ఆసీస్ విజయానికి చివరి 4 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి ఉండగా.. స్టోయినిస్(40), వేడ్(41) సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై వీరవిహారం చేశారు. దీనితో ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేధించి ఫైనల్‌లోకి ఎంటర్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్(49) పరుగులు చేయగా.. మిడిల్ ఆర్డర్‌లో స్టోయినిస్(40) పరుగులు.. వేడ్(41) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు, షాహీన్ అఫ్రిది 1 వికెట్ పడగొట్టారు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు రిజ్వాన్(67), బాబర్ ఆజామ్(39) అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఇక ఆ తర్వాత వన్ డౌన్‌లో వచ్చిన ఫకర్ జామన్(55) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 4 వికెట్లు నష్టానికి 176 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు, కమిన్స్, జంపా చెరో వికెట్ పడగొట్టారు. కాగా, మాథ్యూ వేడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :