Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: వన్డే కెప్టెన్సీ నియామకంపై బీసీసీఐ దృష్టి.. కోహ్లీతో సంప్రదింపులు జరపనున్నట్లు సమాచారం..

భారత జట్టు టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియామకం నేపథ్యంలో బీసీసీఐ వన్డే కెప్టెన్సీపై విరాట్ కోహ్లీతో మాట్లాడబోతున్నట్లు సమాచారం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీని కెప్టెన్సీ భారం నుంచి తప్పించాలని బోర్డు భావిస్తుందని...

Virat Kohli: వన్డే కెప్టెన్సీ నియామకంపై బీసీసీఐ దృష్టి.. కోహ్లీతో సంప్రదింపులు జరపనున్నట్లు సమాచారం..
Kohli
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 11, 2021 | 9:57 PM

భారత జట్టు టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియామకం నేపథ్యంలో బీసీసీఐ వన్డే కెప్టెన్సీపై విరాట్ కోహ్లీతో మాట్లాడబోతున్నట్లు సమాచారం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీని కెప్టెన్సీ భారం నుంచి తప్పించాలని బోర్డు భావిస్తుందని, తద్వారా అతను తన బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని బీసీసీ వర్గాలు ఓ వార్త సంస్థకు తెలిపాయి. దక్షిణాఫ్రికాతో జనవరి 11, 2022 నుంచి ప్రారంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీలో మార్పులు జరగవచ్చని తెలుస్తుంది. రోహిత్ శర్మ 50 ఓవర్ల ఫార్మాట్‌లో కూడా కేఎల్‌తో బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

నవంబర్ 25 నుండి కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. 1వ టెస్టులో విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని బీసీసీ వర్గాలు వార్త సంస్థకు తెలిపాయి. కోహ్లీ స్థానంలో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే జట్టు నాయకత్వం వహిస్తాడు. రెండో టెస్ట్ మ్యాచ్, దక్షిణాఫ్రికాలో భారత్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉన్నందున బ్లాక్‌క్యాప్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నవంబర్ 17న జైపూర్‌లో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. రోహిత్ శర్మ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికాలో భారత్ మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డేలు, నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారత్ నాకౌట్‎కు చేరుకుండానే ఇంటి ముఖం పట్టింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో ఓడిపోయిన తర్వాత సెమీ-ఫైనల్ చేరుకోవడంలో విఫలమైంది. 2017 జనవరిలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో కోహ్లీ పరిమిత ఓవర్ల జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతను 2015 ప్రారంభం నుంచి టెస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కోహ్లీ 95 వన్డేల్లో భారతదేశానికి నాయకత్వం వహించాడు. 65 విజయాలు, 27 ఓటములతో 70 శాతం గెలుపు రేటును అందించాడు.

Read Also..T20 World Cup 2021: జట్టు మొత్తం సంబురాలు చేసుకుంటుంది.. అతడు మాత్రం ప్రశాంతంగా కూర్చున్నాడు..

T20 world cup 2021: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ రిజ్వాన్.. ఒకే సంవత్సరంలో 1000 పరుగులు చేసి ఆటగాడిగా రికార్డు..