Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Reception: నా పెళ్ళికి రండి.. భోజనం చేసి రూ. 7,300 చెల్లించండి .. పిల్లల్ని తీసుకుని రావద్దు.. కండిషన్స్ అప్లై.. ఎక్కడంటే..

Wedding Reception: ఇద్దరు వ్యక్తులను ఒక కొత్త బంధంతో జత చేసే వివాహ వేడుక ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అయితే మరికొందరికి పెళ్లి చేసుకోవడానికి..

Wedding Reception: నా పెళ్ళికి రండి.. భోజనం చేసి రూ. 7,300 చెల్లించండి .. పిల్లల్ని తీసుకుని రావద్దు.. కండిషన్స్ అప్లై.. ఎక్కడంటే..
Wedding Reception
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2021 | 4:14 PM

Wedding Reception: ఇద్దరు వ్యక్తులను ఒక కొత్త బంధంతో జత చేసే వివాహ వేడుక ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అయితే మరికొందరికి పెళ్లి చేసుకోవడానికి అయ్యే ఖర్చు భరించలేనిదిగా మారింది. అయితే ఇటీవల యువతీ యువకులు కొంచెం అతితెలివిని ప్రదర్శిస్తూ.. తమ పెళ్ళికి వచ్చిన వారు తెచ్చ్ గిప్ట్ ల విషయమే కాదు. అతిధులు తమ పెళ్ళిలో తినే తిండి కూడా లెక్కలు కడుతూ.. మీరు ఒక కేకు ముక్క కంటే ఎక్కువ తిన్నారు బిల్లు కట్టండి అన్న వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే అవి పెళ్లి జరిగిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు.. ఇపుడు తాజాగా ఓ యువతి తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. అయితే తన పెళ్లికి వచ్చే అతిధులు భోజనం చేసి.. దానికి ఖర్చుకింద కొంత మొత్తాన్ని చెల్లించమని అడుగుతుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని ఓ మహిళ తన బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తోంది. వీరిద్దరికి ఇప్పటికే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ మహిళకు పెళ్లిపై మనసు కలిగినట్లు ఉంది. దీంతో వివాహం చేసుకోలేని నిర్ణయించుకుంది. అందుకు ఈ జంట పెళ్లికి ముహర్తం కూడా పెట్టుకుని .. అతిధులను , స్నేహితులను తమ పెళ్ళికి రమ్మనమని ఆహ్వానిస్తున్నారు. అయితే  ఆ పెళ్లికూతురు పంపిన ఆహ్వానాన్ని పెళ్లికూతురు పేరు బయట పెట్టకుండా ఆమె స్నేహితురాలు పిసినారి ఫ్రెండ్ అంటూ రెడ్డిట్ లో పోస్టు పెట్టింది. ఇప్పుడు అది నెట్టింట్లో ఓ రేంజ్ లో హల్  చల్ చేస్తోంది

మా పెళ్లికి రండి. వివాహభోజనాలు ఏర్పాటు చేసేంత ఆర్థిక స్థోమత మాకు లేదు. అందుకే పెళ్ళికి వచ్చిన వారు విందు కోసం  99 డాలర్లు అంటే(మనదేశ కరెన్సీలో రూ.7300) చెల్లించమని సూచింది. అంతేకాదు తన పెళ్ళికి వచ్చే ఆహ్వానితులకు మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టింది.. పిల్లలను తీసుకుని రావద్దని ఆహ్వాన పత్రికలో పేర్కొంది. అంతేకాదు తమ పెళ్లి తర్వాత తాము హనీమూన్ వెళ్లాలని అనుకుంటున్నామని… ఇందుకోసం విరాళాలు ఇవ్వాల్సింది అంటూ ఓ బాక్స్ పెట్టింది సదరు పెళ్లికూతురు. అంతేకాదు మీరు మా పెళ్ళికి వచ్చి ఇచ్చే డబ్బులు మా భవిష్యత్ కోసం ఉపయోగపడతాయని.. ఓ కొత్త ఇల్లు కొనుకుంటామని తెలిపింది.

Us Wedding

Us Weddingపెళ్లి కూతురు కండిషన్స్ కు కొంతమంది ఫన్నీగా స్పందిస్తే.. మరికొందరు ఇదేమి విపరీతం అంటూ మండిపడుతున్నారు. దురదృష్టవశాత్తూ మేము హాజరు కాలేకపోతున్నామంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  అది ఇవ్వలేదంటూ మెడికల్ షాపు ఎదుట ఓ యువకుడు వీరంగం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు