Telangana News: అది ఇవ్వలేదంటూ మెడికల్ షాపు ఎదుట ఓ యువకుడు వీరంగం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
Telangana News: డ్రగ్స్ కు అలవాటుపడిన ప్రాణం.. మంచి చెడుల విచక్షణ మరచిపోతుందని వైద్యులు హెచ్చరించడమే కాదు.. అనేక సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి..
Telangana News: డ్రగ్స్ కు అలవాటుపడిన ప్రాణం.. మంచి చెడుల విచక్షణ మరచిపోతుందని వైద్యులు హెచ్చరించడమే కాదు.. అనేక సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి కూడా.. తాజాగా డ్రగ్స్ కు బానిసైన ఓ యువకుడు తాను అడిగిన సిరప్ ఇవ్వలేదంటూ.. మెడికల్ షాప్ దగ్గర వీరంగం సృష్టించాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
భద్రాచలంలో ప్రతిరోజు కరెక్స్ సిరప్ తాగి మత్తులో మునిగి రోడ్డు పై ఓ యువకుడు తిరుగుతున్నాడు. ఈరోజు కూడా కారెక్స్ సిరప్ కోసం పట్టణంలోని లోని UB సెంటర్ వద్ద ఉన్న ఓ మెడికల్ షాపు వద్దకు వెళ్ళాడు. అయితే ఆ మందుల షాపు యజమాని ఆ యువకుడు అడిగిన సిరప్ ఇవ్వడానికి నిరాకరిస్తూ.. డాక్టర్లు రాసి ఇచ్చిన పిస్క్రిప్షన్ ఇవ్వమని.. అప్పుడు మాత్రమే కారెక్స్ సిరప్ ఇస్తానని చెప్పాడు. యువకుడు ఎంత గొడవ చేసినా సిరప్ ఇవ్వడానికి మెడికల్ షాపు యజమాని నిరాకరించాడు. పిస్క్రిప్షన్ లేకపోవడంతో సిరప్ ఇవ్వనంటూ బయటకు పంపించాడు. దీంతో ఆ యువకుడు వేరే షాప్ వద్దకు వెళ్లి.. ఆ సిరప్ కొనుక్కుని తాగాడు. అనంతరం మత్తులో ఊగుతూ.. తనకు ముందుగా సిరప్ ఇవ్వనున్న మెడికల్ షాప్ వద్దకు వచ్చి.. ఆ షాప్ పై దాడికి దిగాడు. డ్రగ్స్ కు బానిసైన యువకుడు రోడ్డు పై వీరంగం సృష్టించాడు. దీంతో ఆ మెడికల్ షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read: పునీత్ సోదరుడికి అండగా నిలిచిన తారక్.. అన్నా నేనున్నానంటూ…