AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Raj Kumar: పునీత్ సోదరుడికి అండగా నిలిచిన తారక్.. అన్నా నేనున్నానంటూ…

Shiva Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, శాండల్ వుడ్ పరిశ్రమ, అభిమానులతో సహా ఇప్పటికీ ఎవరూ..

Shiva Raj Kumar:  పునీత్ సోదరుడికి అండగా నిలిచిన తారక్.. అన్నా నేనున్నానంటూ...
Ntr Shiva Raj Kumar
Surya Kala
|

Updated on: Nov 12, 2021 | 2:42 PM

Share

Shiva Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, శాండల్ వుడ్ పరిశ్రమ, అభిమానులతో సహా ఇప్పటికీ ఎవరూ కోలుకోలేదు.  కుటుంబ సభ్యులైతే తీరని దుఃఖంలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వరకూ తమ మధ్య నవ్వుతూ సంతోషంగా తిరిగిన తమ ఇంటి సభ్యులు లేడు, ఇక తిరిగి రాడు అన్న విషయాన్నీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కాలం తనపని తాను చేసుకుంటూ పోతుంది. మరణించినవారిని జీవించినవారికి తీపిజ్ఞాపకంగా మారుస్తుంది.  తమ్ముడు మరణించిన ఇన్ని రోజుల తర్వాత పునీత్ అన్న శివ రాజ్ కుమార్ తొలిసారిగా టీవీ9 కన్నడ ఛానల్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తన తమ్ముడిని గుర్తు చేసుకుంటూ.. పునీత్ మరణంతో తమ కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులను చెప్పారు.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి శివ రాజ్ కుమార్ ప్రస్తావించారు. తన తమ్ముడు మరణించినప్పుడు ఎన్టీఆర్ నా దగ్గరకు వచ్చి.. అన్నా నేను మీకు ఉన్నా అంటూ దైర్యం చెప్పారు. తమ్ముడిగా అండగా నిలిచాడు అని శివ రాజ్ కుమార్ చెప్పారు. తమ కుటుంబానికి ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధం గురించి శివరాజ్ కుమార్ తెలియజేశారు.

పునీత్ రాజ్ కుమార్ మృతి వార్త తెలిసిన వెంటనే తారక్ బెంగళూరికి వెళ్లిన విషయం తెలిసిందే. పునీత్ మృతదేహాన్ని చూసి ఎన్టీఆర్ కన్నీరు పెట్టారు. శివ రాజ్ కుమార్ ను ఓదార్చిన సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్ కు పునీత్ కు మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇదే విషయాన్నీ పునీత్ కూడా ఒకానొక సందర్భంలో ప్రస్తావించారు. ఇక పునీత్  చక్రవ్యూహ కోసం ఎన్టీఆర్   ‘గెలయా గెలయా’ అనే పాటను పాడారు. అయితే రాజ్ కుమార్ కుటుంబంతో నందమూరి కుటుంబానికి మంచి రిలేషన్ ఇప్పటిది కాదని.. పునీత్ తండ్రి రాజ్ కుమార్ … సీనియర్ ఎన్టీఆర్ ల తరం నుంచి కొనసాగుతూనే ఉంది. నందమూరి బాలకృష్ణకి కూడా శివ రాజ్ కుమార్ తో మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:

: బయట ఉడకబెట్టిన గుడ్లు తింటున్నారా? అయితే, జాగ్రత్త.. అందులో ప్రమాదకరమైన సూడోమోనాస్ బ్యాక్టీరియా ఉండొచ్చు!

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు