Bank Jobs: హైదరాబాద్‌లోని మహేశ్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు..
Bank Jobs: ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న బ్యాంకులో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.?
Bank Jobs: ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న బ్యాంకులో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలిలాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ మేనేజర్ (03), డిప్యూటీ జనరల్ మేనేజర్ (07) ఖాళీలు ఉన్నాయి.
* జనరల్ మేనేజర్‌లో భాగంగా బిజినెస్ డెవలప్‌మెంట్, క్రెడిట్ అండ్ ఆపరేషన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రెజరీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎంబీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ/సీఏ/సీఎస్/సీఏఐఐబీ చేసినవారికి ప్రాధాన్యతనిస్తారు. వీటితోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 55 ఏళ్లకు మించకుడదు.
* డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల్లో భాగంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/ట్రెజరీ, లా, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎంబీఏ/సీఎఫ్‌ఏ /ఐసీడబ్ల్యూఏ/సీఏ/సీఎస్/సీఏఐఐబీ చేసినవారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 53 ఏళ్లు మించకుండా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులు తమ పూర్తి వివరాలను recruit@apmaheshbank.com మెయిల్ ఐడీకి పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు 17-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Biscuits Side Effects: టీతో కలిపి బిస్కెట్లు తింటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్..
Price Hike: కిరాణా..బట్టలు..ఎలక్ట్రానిక్స్..అన్ని వస్తువుల ధరలూ పెరగనున్నాయి.. ఎందుకో తెలుసా..