Biscuits Side Effects: టీతో కలిపి బిస్కెట్లు తింటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్..
Digestive Biscuits Side Effects: ఉరుకుల పరుగుల జీవితంలో.. చాలామంది ఉదయం వేళ అల్పాహారంలో బిస్కెట్లు తినడానికి చాలా ఇష్టపడతారు. టీతోపాటు బిస్కెట్ లేకపోతే వారికి అస్సలు రుచించదు.
Digestive Biscuits Side Effects: ఉరుకుల పరుగుల జీవితంలో.. చాలామంది ఉదయం వేళ అల్పాహారంలో బిస్కెట్లు తినడానికి చాలా ఇష్టపడతారు. టీతోపాటు బిస్కెట్ లేకపోతే వారికి అస్సలు రుచించదు. అయితే.. బిస్కెట్లల్లో ఇప్పుడు మనం డైజెస్టివ్ బిస్కెట్‌లనే ఎక్కువగా వాడుతున్నాం. డైజెస్టివ్ బిస్కెట్‌ల గురించి తరచూ టీవీల్లో, పలు సోషల్ మీడియా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో యాడ్స్ వస్తుంటాయి. డైజెస్టివ్ బిస్కెట్లు అనగానే అందరూ.. ఇవి తింటే ఆకలి నుంచి ఉపశమనం కలుగుతుందని.. దీంతోపాటు వీటిలో చక్కెర, కొవ్వు, సోడియం పదార్థాలు అసలే ఉండంటూ కొనుక్కొని తింటుంటారు. అయితే.. అలాంటి బిస్కెట్ల వల్ల ఎక్కువగా ప్రమాదం పొంచివుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ డైజెస్టివ్ బిస్కెట్లల్లో చక్కెర, కొవ్వు, సోడియం, మైదా పిండి లాంటి హానికరమైన పదార్థాలు దాగి ఉన్నాయి. ఈ బిస్కెట్లలో రుచిని పెంచే రసాయనాలను కూడా కలుపుతారు. అయితే ఈ డైజెస్టివ్ బిస్కెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనుకుంటే పొరపాటేనని.. అవి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైజెస్టివ్ బిస్కెట్లల్లో ఎలాంటి రసయనాలు కలుపుతారు.. వాటివల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ బిస్కెట్లలో అధిక మొత్తంలో గ్లూటెన్ ఉంటుంది బేకరీలో తయారయ్యే వస్తువులన్నీ మైదాతో చేసేవే. అయితే ఈ డైజెస్టివ్ బిస్కెట్లల్లో మైదాకు బదులుగా పిండిని వినియోగిస్తారు. ఈ గోధుమ పిండిలో గ్లూటెన్ ఉంటుంది. అయితే.. ప్రతి బ్రాండ్ కంపెనీ వివిధ రకాల గ్లూటెన్‌ను ఉపయోగిస్తుంది. గ్లూటెన్ అధిక మొత్తంలో తిసుకుంటే.. కడుపు నొప్పి, గ్యాస్, అతిసారం, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి.
ఈ బిస్కెట్లు చక్కెర లేనివి అసలే కావు.. డైజెస్టివ్ బిస్కెట్లు ఇతర బిస్కెట్ల కంటే తక్కువ తీపిగా ఉంటాయి. అయితే సహజ స్వీటెనర్లతో పాటు వీటిల్లో చక్కెరను కూడా ఉపయోగిస్తారు. ఇది షుగర్ లెస్ కాదని స్పష్టమైంది. అలాంటి వాటిని తినడం ద్వారా.. అదనపు చక్కెర తిన్నట్లేనని పేర్కొంటున్నారు. ఈ బిస్కెట్లలో కలిపిన చక్కెర పరిమాణం దాని నియంత్రణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను పెంచుతుంది.
ఫ్యాట్ కూడా ఎక్కవే.. డైజెస్టివ్ బిస్కెట్ల ప్యాకెట్‌పై కొవ్వు రహితంగా రాసి ఉంటుంది. అయితే వాటిలో కొవ్వు ఇతర పదార్థాలను ఉపయోగిస్తారు. ఎక్కువ సంతృప్త కొవ్వును తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, జీర్ణశయాంతర వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఎక్కువ కాలం ఉండేలా.. మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి.. ఇతర బిస్కెట్‌ల మాదిరిగానే ఈ బిస్కెట్‌లకు ప్రిజర్వేటివ్ రసాయనాలను జోడిస్తారు. తద్వారా అవి ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటాయి. సువాసన కోసం ఈ బిస్కెట్లకు పలు రసాయన పదార్థాలను జోడించడం కూడా తప్పనిసరి. ఇవి మీ శరీరానికి లాభం కంటే.. ఎక్కువగా నష్టం బారిన పడేస్తాయి.
సోడియంతో అనారోగ్య సమస్యలు.. ఈ బిస్కెట్ల రుచిని మెరుగుపరచడానికి తేలికగా చేయడానికి, సోడియం పదార్థాన్ని బాగా కలుపుతారు. అధిక మొత్తంలో సోడియం తింటే.. అది అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.
Also Read: