- Telugu News Photo Gallery Follow these tips to stop the junk food and unhealthy foods craving aarogya chitkalu
Health Tips: చలికాలంలో జంక్ ఫుడ్ తింటున్నారా..? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Junk Food - Unhealthy Food: అసలే చలికాలం.. జంక్, అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం కొంచెం కష్టమే. దీనివల్ల బరువు అమాంతం పెరుగుతారు. ఇలాంటి పరిస్థితిలో.. మీరు జంక్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండాలి. చలికాలంలో ఆహార కోరికను తగ్గించడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Nov 12, 2021 | 2:18 PM

తగినంత ప్రోటీన్ ఆహారం తినండి - జంక్ ఫుడ్ తినకుండా ఉండటానికి తగినంత ప్రోటీన్ ఆహారం తినడం ఉత్తమం, ఆరోగ్యకరం. ప్రొటీన్ ఆహారం కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే కోరికను కూడా నిరోధిస్తుంది. కావున ఆహారంలో కూరగాయలు, బీన్స్, చేపలు, తృణ ధాన్యాలను చేర్చుకోవాలి.

ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి - కొన్ని సందర్భాల్లో దాహం కారణంగా జంక్ ఫుడ్, డ్రింక్స్ లాంటివి కూడా తీసుకుంటాం. ఇలాంటి సందర్భాల్లో ఏదైనా అనారోగ్యకరమైన ఆహారం తినాలని అనిపించినప్పుడల్లా.. మొదట ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఇది మీరు కోరికలను నివారించడానికి, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

పండ్లు, కూరగాయాలు తినాలి: ఇంట్లో ఖాళీ సమయాల్లో, తృప్తిగా లేనప్పుడు తరచుగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిలో కోరికలను తగ్గించడానికి మీరు భోజనం తర్వాత ఆకలేసినప్పుడు కీర దోసకాయలు, క్యారెట్ వంటి పండ్లు, కూరగాయలను తినవచ్చు. ఈ విధంగా మీరు నాన్-హల్దీ ఆహారాన్ని తినకుండా నిరోధించవచ్చు.

తగినంత నిద్ర అవసరం - ప్రతిరోజూ తగినంత నీరు తాగడం ఎంత ముఖ్యమో.. తగినంత నిద్ర పొందడం కూడా అంతే ముఖ్యం. మీరు తీపి, ఉప్పగా ఉండే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలంటే రాత్రిపూట 6 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి.

బాగా నమలి తినాలి - అధ్యయనాల ప్రకారం.. మీరు ఆహారాన్ని సరిగ్గా నమిలి తింటే.. ఆహార కోరిక తగ్గి కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండేందుకు మీరు చూయింగ్ గమ్స్ కూడా నమలొచ్చు. ఇంకా జంక్ ఫుడ్ కోరికలను నివారించడానికి.. మీరు ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవాలి. పాప్‌కార్న్, డ్రై ఫ్రూట్స్, గింజలు, ఫాక్స్ నట్స్, రాగి చిప్స్‌ను లాంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది.





























