- Telugu News Photo Gallery Technology photos Reliance Jio Launching Jiobook Laptop have a look on leaked features
Jio Book: మరో సంచలనం.. త్వరలోనే మార్కెట్లోకి జియో ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?
Jio Book: భారత టెలికాం రంగంలో పెను సంచలనంలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో తాజాగా జియో బుక్ పేరుతో ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఫీచర్లు కొన్ని నెట్టింట వైరల్‌గా మారాయి. వాటి ప్రకారం..
Updated on: Nov 12, 2021 | 3:28 PM

భారత టెలికాం రంగాన్ని ఒక కుదుపుకుదిపింది రిలయన్స్ జియో. తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ను పరిచయం చేసిన జియోకు అత్యంత తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు పెరిగారు. ఇక తాజాగా దీపావళికి జియో నుంచి స్మార్ట్ ఫోన్‌లు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా జియో తక్కువ ధరకే 'జియోబుక్' పేరుతో ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చే పనిలో పడింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అత్యంత చవకైన ల్యాప్‌టాప్‌గా చర్చ జరుగుతోన్న ఈ జియో బుక్ ఫీచర్లు కొన్ని నెట్టింట వైరల్‌గా అవుతున్నాయి.

వీటి ప్రకారం ఈ ల్యాప్‌టాప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్తో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్ టాప్ 2జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనున్నట్లు సమాచారం.

విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని రూపొందిస్తోన్న ఈ ల్యాప్‌టాప్‌లో 1,366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్‌టీఈ మోడెమ్ డిస్‌ప్లేని అందించనున్నారని వార్తలు వస్తున్నాయి.

జియో ఈ ల్యాప్‌టాప్‌ను రెండు విభిన్న మోడల్స్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ, 5గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్‌కోమ్ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు.





























