Refined Oil: రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి చెడు చేస్తుందా? ఆయిల్ రిఫైనింగ్ ఎందుకు చేస్తారో తెలుసా?.. ఆసక్తికర విషయాలు మీకోసం..

Refined Oil: సంతృప్త కొవ్వు, మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, బహుళ అసంతృప్త కొవ్వు పదార్థాలు మనం రోజూ తినే నూనెలో ఉంటాయి.

Shiva Prajapati

|

Updated on: Nov 12, 2021 | 1:53 PM

వాహనాల్లో ఉపయోగించే పెట్రోల్-డీజిల్‌ను క్రూడ్ ఆయిల్(ముడి చమురు)ని శుద్ధి చేయడం ద్వారా తయారు చేస్తారు. అదేవిధంగా, ఎడిబుల్ ఆయిల్ అంటే వంట నూనె కూడా శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడిన నూనెను రిఫైన్డ్ ఆయిల్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అన్ని ఎడిబుల్ ఆయిల్స్‌లో 85 శాతం శుద్ధి చేసినవే. అయితే, ఈ రిఫైన్డ్ ఆయిల్‌పై అనేక రకాల ప్రచారాలు జరుగుతుంటాయి. రిఫైన్డ్ ఆయిల్ వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇది నిజమేనా? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ముందుగా, ఎడిబుల్ ఆయిల్ ఎందుకు శుద్ధి చేస్తారో తెలుసుకుందాం? వంట కోసం ఉపయోగించే నూనెలకు కచ్చితంగా శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని నిపుణులు సైతం ఉద్ఘాటించి చెబుతారు. ఫిల్టర్ చేయడం ద్వారా ముడి నూనెలో ఉండే టాక్సిన్స్, మలినాలను తొలగించడం జరుగుతుంది. దీంతో పాటు, చమురు షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి కూడా రిఫైనింగ్ అవసరం. నూనెలను శుద్ధి చేయడం వల్ల అవి అధిక వేడిని తట్టుకుని ఆవిరా కుకుండా ఉంటుంది.

2 / 5
వంట కోసం ఉపయోగించే నూనెలో కొవ్వు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో సంతృప్త కొవ్వు, మోనోశాచురేటెడ్ కొవ్వు, బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ సంతృప్త కొవ్వు పదార్థాలు ఉన్న నూనెలను వాడాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. బహుళ అసంతృప్త కొవ్వులు, ఒమేగా-3, 6 కొవ్వులు కలిగిన నూనెలు మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3 / 5
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి హానికరమా? రిఫైన్డ్ ఆయిల్ వినియోగించడం వల్ల క్యాన్సర్ వస్తుందా?. ఇదంతా అపోహ మాత్రమే అని, పూర్తిగా అసత్య వాదన అని నిపుణులు పేర్కొంటున్నారు. సీనియర్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ.. రిఫైన్డ్ ఆయిల్ వల్ల ఎలాంటి హాని జరుగదని చెబుతున్నారు. చమురు శుద్ధి కోసం ఉపయోగించే రసాయనాల వల్ల క్యాన్సర్ వస్తుందని ఏ అధ్యయనంలోనూ రుజువు కాలేదన్నారు.

4 / 5
వంట కోసం శుద్ధి చేసిన నూనెను ఉపయోగించడం సురక్షితమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సైతం స్పష్టం చేసింది. FSSAI సర్టిఫైడ్ రిఫైన్డ్ ఆయిల్‌నే వాడాలని ప్రజలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెజిటబుల్ ఆయిల్ రిఫైనింగ్‌ను కూడా ఆమోదించింది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. నూనెను కొనుగోలు చేసేటప్పుడు, కొవ్వు పరిమాణాన్ని గమనించాలి. అలాగే వినియోగించిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తూ వినియోగించవద్దు.

5 / 5
Follow us
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి

వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..

రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..