- Telugu News Photo Gallery Viral photos Why K is Used for Thousand Like 50K for 50 Thousand Here Is The Interesting Details
Odd News: 50 వేలను 50K గా ఎందుకు రాస్తారు?.. 50T అని ఎందుకు రాయరు?.. ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..
Odd News: ప్రస్తుత కాలంలో వెయ్యి రూపాయలను గానీ, వేల సంఖ్యను లెక్కించడం కోసం గానీ ఆంగ్ల అక్షరం K ని వినియోగిస్తారనే విషయం తెలిసిందే. కానీ, అలా ఎందుకు ఉపయోగిస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? వెయ్యి స్థానంలో K కి బదులుగా T ని ఎందుకు వినియోగించకూడదో ఎప్పుడైనా థింక్ చేశారా?.
Updated on: Nov 12, 2021 | 1:57 PM

Odd News: ప్రస్తుత కాలంలో వెయ్యి రూపాయలను గానీ, వేల సంఖ్యను లెక్కించడం కోసం గానీ ఆంగ్ల అక్షరం K ని వినియోగిస్తారనే విషయం తెలిసిందే. కానీ, అలా ఎందుకు ఉపయోగిస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? వెయ్యి స్థానంలో K కి బదులుగా T ని ఎందుకు వినియోగించకూడదో ఎప్పుడైనా థింక్ చేశారా?.

ప్రస్తుత రోజుల్లో 10వేలు, 20వేలు రాయడానికి బదులుగా 10K లేదా 20K అని రాస్తుంటారు. కొందరనే కాదు.. దాదాపు అందరూ ఇదే అక్షరాన్ని వినియోగిస్తుంటారు. K అంటే వెయ్యి అని అర్థం. వాస్తవానికి వెయ్యిని ఇంగ్లీష్‌లో థౌజండ్ అంటారు. థౌజండ్ అనే పదం ఇంగ్లీష్‌లో T తో మొదలవుతుంది. మరి వెయ్యిని సూచించడానికి T ని సూచించాలి గానీ.. K ని ఎందుకు సూచిస్తున్నారు? దాని వెనుక కారణం ఏంటి?

వెయ్యికి సూచికగా వినియోగిస్తున్న K ‘చిలియోయ్’ అనే గ్రీకు పదంతో ఉద్భవించింది. ప్రాచీన కాలంలో ‘చిలియోయ్’ ని వెయ్యికి ప్రామాణికంగా ఉపయోగించేవారట.

ప్రాచీన కాలంలో ‘చిలియోయ్’ని వెయ్యికి ప్రమాణికంగా సూచించారు. అనేక గ్రీకు గ్రంథాల్లోనూ దీనిని పేర్కొనడం జరిగింది. దీనిని ముందుగా ఫ్రెంచ్ వారు గ్రహించారు. కాల క్రమంలో అది కిలోగా మారింది. కిలో అంటే 1000 అని అక్కడ అర్థం. అలా వెయ్యితో గుణించాల్సిన చోట కిలో పదాన్ని వాడేవారట. 1000 కిలోగ్రాములు, 1000 కిలో లీటర్లు.. ఇలా 1000కి ప్రతిరూపంగా కిలో ని వినియోగించడం మొదలు పెట్టారు.

అలా కిలో(Kilo) అనే పదంలో మొదటి అక్షరమైన K ని వెయ్యికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తూ వస్తున్నారు. 10 వేలు, 50 వేలు అని రాసేబదులు.. 10K, 50K అని రాస్తూ వస్తున్నారు. అదే విధానాన్ని ప్రపంచ దేశాలు పాటిస్తూ వస్తున్నాయి. ఇదన్నమాట కథ.
