AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food: మనం లొట్టలేసుకుంటూ తినే సమోసా.. ఇష్టంగా తాగే టీ మన ఫుడ్ కాదు తెలుసా? మన ఆహారంగా స్థిరపడిపోయిన విదేశీ ఆహారాలు ఇవే!

చాలా మంది ఆహార ప్రియులు.. విభిన్నమైన వాటిని తినడానికి ఇష్టపడతారు. అల్పాహారంలో, ప్రజలు తరచుగా సమోసా, గులాబ్ జామూన్, జిలేబీ, టీ, బ్రెడ్ పకోరా వంటి వంటకాలను తినడానికి ఆసక్తి చూపుతారు.

Food: మనం లొట్టలేసుకుంటూ తినే సమోసా.. ఇష్టంగా తాగే టీ మన ఫుడ్ కాదు తెలుసా? మన ఆహారంగా స్థిరపడిపోయిన విదేశీ ఆహారాలు ఇవే!
Food
KVD Varma
|

Updated on: Nov 12, 2021 | 10:38 AM

Share

Food: చాలా మంది ఆహార ప్రియులు.. విభిన్నమైన వాటిని తినడానికి ఇష్టపడతారు. అల్పాహారంలో, ప్రజలు తరచుగా సమోసా, గులాబ్ జామూన్, జిలేబీ, టీ, బ్రెడ్ పకోరా వంటి వంటకాలను తినడానికి ఆసక్తి చూపుతారు. ఈ రుచికరమైన వస్తువులను తినడానికి ఇష్టపడే వ్యక్తులను ఎవరూ ఆపలేరు. సాధారణంగా ఈ స్నాక్స్ లేదా స్వీట్స్ మన దేశంలో సంప్రదాయమైన ఆహారంగా మారిపోయాయని చెప్పవచ్చు. అయితే, మనం సాధారణంగా తినే స్నాక్స్, ఈ సాధారణ విషయాలు నిజానికి భారతీయమైనవి కావు. ఒకప్పుడు విదేశీ వ్యాపారులతో భారతదేశంలోకి ప్రవేశించిన ఇటువంటి అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ వాటి రుచి అందరి నాలుకపై విపరీతంగా మారింది.దీంతో ఇవి మన వంటకాలలా భారతదేశంలో స్థిరపడిపోయాయి. అటువంటి ఆహార పదార్థాల జాబితాను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సమోసా

సమోసా అంటే అందరికీ చాలా ఇష్టం. సాయంత్రం లేదా ఉదయం, దాని సువాసన తగిలిన వెంటనే మన జివ్హ వాటిని తినడం కోసం తహతహలాడుతూ ఉంటుంది. అయితే సమోసా భారతదేశపు ఆహారం కాదని మీకు తెలుసా. నిజానికి సమోసా మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చింది. ఒకప్పుడు దీనిని ‘సంభోసా’ అని పిలిచేవారు.

తీపి వంటకం

వేడి వేడి గులాబ్ జామూన్ తినడం భలే ఉంటుంది. చల్లబడిన గులాబ్ జామూన్ ను కూడా ఐస్ క్రీములో కలిపి తింటే ఇక ఆ రుచి సూపరో సూపర్ అని అనకుండా ఉండలేరు ఎవరైనా. నిజానికి గులాబ్ జామూన్ అంటే చాలామందికి పిచ్చి. ప్రతి ఫంక్షన్ వైభవాన్ని పెంచే ఈ వంటకం పర్షియన్ దేశాల నుండి భారతదేశానికి వచ్చింది. దీనిని ‘లోకమా’ లేదా ‘లుక్మత్-అల్-ఖాదీ’ అని పిలుస్తారు.

జిల్..జిల్..జిలేబీ!

జిలేబీకి దాని స్వంత రుచి ఉంటుంది. దాదాపు అందరూ జిలేబీ తినడానికి ఇష్టపడతారు. జలేబీ పర్షియన్, అరబ్ దేశాల నుండి వచ్చిందని చెబుతారు. అయితే దాని పేరులో ఎలాంటి మార్పు చేయకపోవడం ఆశ్చర్యకరం.

టీ

అవును, టీ లేకుండా రోజు అసంపూర్ణంగా ఉంటుంది. చాలామందికి టీ తాగటంతోనే ప్రతి ఉదయం ప్రారంభమవుతుంది. మనమంతా ఎంతో ఇష్టపడే టీ కూడా భారతదేశానికి చెందినది కాదు. భారతీయులు ఇష్టపడే టీ బ్రిటన్ నుండి వచ్చింది. తరువాత భారతీయ రుచిగా స్థిరపడిపోయింది.

బిర్యానీ

హైదరాబాదీ బిర్యానీ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందింది, బిర్యానీ తండ్రి హైదరాబాద్‌ అని ప్రజలు తరచుగా అనుకుంటారు. కానీ అలా కాదు. కాకపోతే, బిర్యానీ మొదటిసారి భారతదేశంలో తయారు చేసి ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళింది. నిజానికి బిర్యానీ టర్కిష్ సంప్రదాయ వంటకం.

రాజ్మా..

రాజ్మా చావ్లా తరచుగా ఆకలిని తీర్చుకోవడానికి ప్రజలు ఉపయోగిస్తారు. కానీ రాజ్మా భారతీయ వస్తువు కాదు. మెక్సికో నుంచి రాజ్మా వచ్చిందని చెబుతారు. అయితే, ఇప్పుడు ప్రతి భారతీయుడికి ఇది చాలా ఇష్టమైన ఆహారం.

దాల్ భాత్

దాల్ భాత్ ఈశాన్య ప్రజలకు ఇష్టమైన ఆహారం. అందుకే ఈ వంటకం ఇక్కడి నుంచి వచ్చినదే అని అనుకుంటారు. కానీ వాస్తవానికి దాల్ భాత్ రెసిపీ పొరుగు దేశం నేపాల్ నుండి భారతదేశానికి వచ్చింది..

ఇవి కూడా చదవండి: Indian Youth: భారత యువత ధోరణిలో మార్పు.. యువతరం డబ్బు ఖర్చు విషయంలో ఏమి ఆలోచిస్తోందో తెలుసా?

Airforce: పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ కోసం సన్నాహాలు..హాజరు కానున్న ప్రధాని మోడీ

Vermcompost: గూగుల్ దారి చూపించింది..యూట్యూబ్ లో చూసి నేర్చుకుంది..వర్మికంపోస్ట్‌తో లక్షలు సంపాదిస్తోంది.. ఎలానో తెలుసా?