Syringe crisis: సిరెంజిల కొరత ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎందుకంటే..
వచ్చే ఏడాది నాటికి, ప్రపంచంలో దాదాపు 200 మిలియన్ ఇంజెక్షన్ సిరంజిల కొరత ఉండవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
Syringe crisis: వచ్చే ఏడాది నాటికి, ప్రపంచంలో దాదాపు 200 మిలియన్ ఇంజెక్షన్ సిరంజిల కొరత ఉండవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కారణంగా, సిరంజిలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 725 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ మోతాదులు ఇచ్చారు. వీటిలో సింగిల్, డబుల్, బూస్టర్ డోస్‌లు ఉన్నాయి. ఈ టీకా మొత్తం సాధారణంగా ఒక సంవత్సరంలో ఇచ్చిన మొత్తం టీకాల కంటే రెండింతలు ఎక్కువ. ప్రతి మోతాదుకు ప్రత్యేక సిరంజి ఉపయోగిస్తారు. కాబట్టి సిరంజి వినియోగం కూడా ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుంది.
వ్యాధుల నుంచి కాపాడే లక్ష్యం నెమ్మదిస్తుంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మెడిసిన్స్, హెల్త్ ప్రొడక్ట్‌లకు యాక్సెస్ విభాగానికి చెందిన సీనియర్ సలహాదారు లిసా హెడ్‌మాన్, మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే సంవత్సరం వరకు టీకాలు వేయడానికి సిరంజిల లభ్యత లేకపోవడం మా నిజమైన ఆందోళన. ఇది టీకా వేగాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో, అనేక వ్యాధుల నుండి ప్రజలను రక్షించే ప్రయత్నాలపై కూడా ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.” అని పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక లేకపోవటం దొంగ నిల్వ పరిస్థితులకు దారితీస్తుంది. ఎందుకంటే, సిరంజిలు ఉత్పత్తి పెంచాల్సిన ఒక అవసరం ఉందని డబ్ల్యుహెచ్వో సిఫారసు చేసింది. అదే సమయంలో, సిరంజిల సరఫరా తగ్గిన కారణంగా, ప్రపంచ స్థాయిలో భయాందోళనలు కూడా ఉండవచ్చు. వ్యాక్సిన్లు, సిరంజిల సరఫరా కూడా ఉత్పత్తి, వినియోగ స్థలంలో దూరంపై కూడా ఆధారపడి ఉంటుంది.
సమర్థవంతమైన ప్రణాళికపై పని చేయడం అవసరం
లిసా హీడ్‌మాన్ ఇంకా ఇలా చెప్పారు. ”అవసరాల కొరత సంకేతాలు నిజంగా కలవరపెడుతున్నాయి. సిరంజిల విషయానికొస్తే, ఈ కొరత 100 నుండి 200 కోట్ల వరకు ఉంటుంది. సకాలంలో ఎదుర్కోవడానికి సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించాలి.”
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా టీకా తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని వేగవంతం చేశారు. అయితే, ఇప్పటివరకూ అందుతున్న నివేదికల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నదాని ప్రకారం మరో నెలరోజుల టీకా ఉత్పత్తికి అవసరమైన సిరెంజిలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిరెంజి తయారీ కంపెనీలు తక్కువగా ఉండటం.. వ్యాక్సిన్ కోసం నాణ్యమైన సిరెంజి వాడకానికి సిద్ధం చేయడం ఆలస్యం అవుతోంది. దీంతో.. వచ్చే సంవత్సరంలో వ్యాక్సిన్ కోసమే కాకుండా సాధారణ ఉపయోగం కోసం కూడా సిరెంజిల కొరత ఎదురయ్యే అవకాశం ఉందని డబ్ల్యు హేచ్వో అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి: Food: మనం లొట్టలేసుకుంటూ తినే సమోసా.. ఇష్టంగా తాగే టీ మన ఫుడ్ కాదు తెలుసా? మన ఆహారంగా స్థిరపడిపోయిన విదేశీ ఆహారాలు ఇవే!