AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నువ్వు గ్రేట్‌ బ్రో.. గుడ్లగూబను దత్తత తీసుకున్న నటుడు..

సాధారణంగా గుడ్లగూబను చూడగానే చాలామంది భయపడతారు.. అసహ్యించుకుంటారు. ముఖ్యంగా దాని కళ్లను చూడగానే వణుకు పుడుతుంది..

Hyderabad: నువ్వు గ్రేట్‌ బ్రో.. గుడ్లగూబను దత్తత తీసుకున్న నటుడు..
Basha Shek
|

Updated on: Nov 12, 2021 | 6:43 PM

Share

సాధారణంగా గుడ్లగూబను చూడగానే చాలామంది భయపడతారు.. అసహ్యించుకుంటారు. ముఖ్యంగా దాని కళ్లను చూడగానే వణుకు పుడుతుంది. అందుకే చాలావరకు హర్రర్‌, థ్రిల్లర్‌ సినిమాల్లో ఏదైనా భయానక సన్నివేశాలకు ముందు చెట్టుపై కూర్చున్న గుడ్లగూబనే చూపిస్తుంటారు. అదేవిధంగా ఈ పక్షిని అపశకునంగా, దురదృష్టానికి సంకేతంగా కూడా భావిస్తారు. అయితే అలాంటి పక్షిని దత్తత తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు నిర్మాత, నటుడు సూర్యతేజ్‌. శుక్రవారం హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్‌ పార్కును ఆయన సందర్శించాడు. అనంతరం జూపార్క్‌లోని గుడ్లగూబను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన రూ.20వేల చెక్‌ను జూపార్క్‌ క్యూరేటర్‌ రాజశేఖర్‌కు అందించాడు.

మరికొంతమంది ముందుకు రావాలి.. ఈ సందర్భంగా సూర్యతేజ్‌ మాట్లాడుతూ నెహ్రూ జులాజికల్‌ పార్కును సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. తన జీవితంలో మరుపురాని విషయాల్లో ఇది కూడా ఒకటని తెలిపాడు. హైదరాబాద్‌ నగరం ఎన్నో మూగజీవాలకు నిలయంగా ఉందని, నెహ్రూ పార్క్‌ నిర్వహణ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. అనంతరం జూపార్క్‌ క్యూరేటర్‌ రాజశేఖర్‌ మాట్లాడూతూ సూర్యతేజ లాగే మరికొంత మంది హీరోలు, సామాన్యులు జంతువులు, పక్షుల దత్తత కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘మూగజీవాల సంరక్షణలో భాగంగా సూర్యతేజ్‌ తీసుకున్న నిర్ణయం మరెంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అతడిని చూసి మరికొంతమంది హీరోలు, సామాన్యులు జంతువులను దత్తత తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

Also Read:

Hyderabad: హైదరాబాద్ రోడ్ల అభివృద్దికి స్థల సేకరణ వేగవంతం.. GHMC కీలక నిర్ణయం..

Mahesh Bank: మహేష్‌ బ్యాంక్‌ కేసులో కీలక మలుపు.. మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ

Mahesh Bank: మహేష్‌ బ్యాంక్‌ కేసులో కీలక మలుపు.. మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా