AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సమాధానాలు.. సీఎం జగన్‌తో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.. డోన్ట్‌ మిస్..

TV9 interview with YS Jagan: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే.. హైస్పీడులో ప్రచారంలో దూసుకెళ్తూ తాను చేసిన అభివృద్ధి.. కూటమి కుట్రలు.. భవిష్యత్తు గురించి చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

YS Jagan: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సమాధానాలు.. సీఎం జగన్‌తో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.. డోన్ట్‌ మిస్..
YS Jagan interview with TV9 Managing Editor Rajinikanth
Shaik Madar Saheb
|

Updated on: May 08, 2024 | 12:44 PM

Share

TV9 interview with YS Jagan: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే.. హైస్పీడులో ప్రచారంలో దూసుకెళ్తూ తాను చేసిన అభివృద్ధి.. కూటమి కుట్రలు.. భవిష్యత్తు గురించి చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా జగన్‌ నోటి వెంట డైలాగులు బుల్లెట్లలా దూసుకువస్తున్నాయి.. జూన్‌ 4న విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా, ఇక్కడి నుంచి పరిపాలన చేస్తా… కాస్కోండి అంటూ సవాల్‌ విసురుతున్నారు. అసలు చంద్రబాబు, పవన్, మోదీ ఎందుకు జట్టు కట్టారో ఏపీ ప్రజలకు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రా ప్రజలకు హామీ ఇవ్వగలరా అంటూ కూటమిని ఛాలెంజ్‌ చేస్తున్నారు. ఎవరు మంచి చేశారో… ఎవరు పేదలకు అండగా నిలబడ్డారో… ఆలోచించి ఓటేయాలని ప్రజలకు పిలుపునిస్తున్న సీఎం జగన్‌.. ఎన్నికల పోరు తుది దశకు వచ్చిన సందర్భంగా టీవీ9 తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సమాధానాలు.. జగన్ కు ఎందుకు ఓటు వేయాలి.. పథకాలు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కుటుంబంలోని గొడవలు.. షర్మిలతో విబేధాలు ఇలా .. ప్రశ్నలకు సీఎం జగన్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఏపీ సీఎం జగన్‌తో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది.. డోన్ట్‌ మిస్..

తెలంగాణ రాజకీయాలపై జగన్‌ ఆలోచనలేంటి?. నమ్ముకున్న పథకాలు నిలబెడతాయా? రెండో సారి ప్రభుత్వ ఏర్పాటుపై అంత ధీమా ఎందుకు..? టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ అడిగిన ఈ ప్రశ్నలకు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎలాంటి సమాధానం చెప్పారో… తెలియాలంటే.. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే ఇంటర్వ్యూను తప్పక చూడండి.

ఐదేళ్ల తర్వాత తొలి ఇంటర్వ్యూ..

5 ఏళ్ల తర్వాత మీడియాకి సీఎం జగన్‌ తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పిన సీఎం.. అభివృద్ధి జరగలేదనే విపక్షాల విమర్శలకు ఆధారాలతో కౌంటర్లు ఇచ్చారు. సంక్షేమ పథకాలు, విశాఖ రాజధానిపై విజన్‌ ఆవిష్కరించిన జగన్.. ప్రధాని మోదీతో స్నేహం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పైనా వివరణ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పారు. 5 ఏళ్లలో ఏం చేశారు.. వచ్చే 5 ఏళ్లు ఏం చేస్తారో సీఎం జగన్ వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..