AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: తృటిలో తప్పిన పెను ప్రమాదం..చింతపల్లి ఘాట్ రోడ్డులో వస్తుండగా..

చింతపల్లి ఘాట్ రోడ్‎లో ఆర్టీసీ బస్సుకు తృటిలో ముప్పు తప్పింది. వర్షాలకు రోడ్డుపై వరద నీరు ప్రవహించి మట్టి కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు అంచున జారి మట్టిలో కూరుకుపోయింది. దీంతో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి ఒరిగిపోయింది. ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. అల్లూరి ఏజెన్సీలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపైకి వరద నీరు ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.

AP News: తృటిలో తప్పిన పెను ప్రమాదం..చింతపల్లి ఘాట్ రోడ్డులో వస్తుండగా..
Rtc Bus
Maqdood Husain Khaja
| Edited By: Srikar T|

Updated on: May 08, 2024 | 10:04 AM

Share

చింతపల్లి ఘాట్ రోడ్‎లో ఆర్టీసీ బస్సుకు తృటిలో ముప్పు తప్పింది. వర్షాలకు రోడ్డుపై వరద నీరు ప్రవహించి మట్టి కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు అంచున జారి మట్టిలో కూరుకుపోయింది. దీంతో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి ఒరిగిపోయింది. ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. అల్లూరి ఏజెన్సీలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపైకి వరద నీరు ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.

అయితే ఈ భారీ వర్షాలకు.. నిర్మాణంలో ఉన్న రోడ్డుపై మట్టి కొట్టుకుపోతుంది. చింతపల్లి మీదుగా లంబసింగి వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రహదారి విస్తరణతో పాటు మరికొన్ని చోట్ల మట్టిని తవ్వి చదును చేస్తున్నారు. వర్షాలకు మట్టి పనులు జరుగుతున్న రోడ్లలో బురద చేరింది. దీంతో చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్తున్న టూ స్టాప్ ఆర్టీసీ బస్సు.. కొలపరి సమీపంలో అదుపుతప్పింది. వర్షాలకు రహదారి అంచున ఉన్న మట్టిలోకి ప్రమాదవశాత్తు జారీ ఒక పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నారు. వారంతా భయంతో హుటాహుటిన కిందకు దిగిపోయారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…