Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌కు బదులు.. ఈవీఎం నమూనా పేపర్‌.. ఈసీ సీరియస్

చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రద్దు అయిన పోస్టల్ బ్యాలెట్‌ ఓటింగ్‌పై కీలక ప్రకటన విడుదల చేశారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. రద్దయిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను ఈ నెల 8, 9 తేదీల్లో జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

AP News: ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌కు బదులు.. ఈవీఎం నమూనా పేపర్‌.. ఈసీ సీరియస్
Andhra Election
Follow us
Ram Naramaneni

|

Updated on: May 08, 2024 | 8:00 AM

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పలువురు అధికారులపై ఈసీ చర్యలకు ఆదేశించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్ అయింది. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌ పేపర్లకు బదులు.. ఈవీఎం బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు అధికారులు. అధికారుల నిర్లక్ష్యంతో 12వందల 19 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఉద్యోగుల ఫిర్యాదుతో వీరందరికి రెండురోజుల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని సీఈసీ ఆదేశించింది. సంబంధిత అధికారులపై.. ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 9 వరకు అవకాశం ఉందని ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో మోదీ పర్యటన నేపథ్యంలో మరో రోజు గడువు పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు. 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్లలో 3.30 లక్షల బ్యాలెట్ల ఓట్లు వినియోగించుకున్నారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మిగిలిన ఓటర్లు ఈ నెల 9వ తేదీ లోపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఒంగోలులో ఉద్యోగులు ప్రలోభాలకు గురైనట్టు తెలిసిందని మీనా చెప్పారు. దీనిపై విచారణ జరుపుతామని వెల్లడించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్వకాల మేరకే ఎన్నికలలో నిబంధనలను ఒక్కోసారి సడలిస్తుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి స్వంత నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలట్ ను వినియోగించుకుని వారికి కేటాయించిన విధులకు వెళ్లాలనిసీఈవో కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…