Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: 'ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం'.. వల్లభనేని వంశీ

Watch Video: ‘ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం’.. వల్లభనేని వంశీ

Srikar T

|

Updated on: May 08, 2024 | 11:58 AM

గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల విషయంలో ఈసీ పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు పసుపు-కుంకమ పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగేళ్లుగా నడుస్తున్న స్కీమ్స్‌ నిలిపివేశారని వివరించారు. పేదలను బాధపెట్టడమే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు.

గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల విషయంలో ఈసీ పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు పసుపు-కుంకమ పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగేళ్లుగా నడుస్తున్న స్కీమ్స్‌ నిలిపివేశారని వివరించారు. పేదలను బాధపెట్టడమే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఏపీలో సంక్షేమ పథకాలను అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. ఈసీ అనుమతిస్తే పేదలకు రూ.10 వేల కోట్లు లబ్ధి రూపంలో అందుతుందని వివరించారు. చంద్రబాబు బయటికి ఓ రకంగా కనిపిస్తారు, లోపల మరో రకంగా చేస్తారన్నారు. జగన్ మంచి చేస్తుంటే చంద్రబాబుకు మింగుడు పడటం లేదని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థపై కూడా స్పందించారు వంశీ. వృద్దాప్య పెన్షన్ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒకటో తేదీ అందకపోవడానికి కారణం చంద్రబాబు అన్నారు. ఈసీకి పెన్షన్ల పంపిణీపై పిటిషన్ వేసి నిలిపివేశారన్నారు. అలాగే గతంలో కూడా ఇలా బ్యాంకులకు పెన్షన్ పంపిణీ విధానాన్ని తీసుకొచ్చి వృద్దులు, వికలాంగులు డబ్బులు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ మళ్లీ ఇలాంటి విధానాన్నే తీసుకొచ్చి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…