Telangana: రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..

వేములవాడ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈరోజు రెండు సభల్లో పాల్గొన్ని ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఇందులో భాగంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు బయలుదేశారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో మంగళవారం బస చేసిన ప్రధాని బుధవారం బేగంపేట నుంచి వేములవాడ చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

Telangana: రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
Pm Modi
Follow us
Srikar T

|

Updated on: May 08, 2024 | 10:30 AM

వేములవాడ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈరోజు రెండు సభల్లో పాల్గొన్ని ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఇందులో భాగంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు బయలుదేశారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో మంగళవారం బస చేసిన ప్రధాని బుధవారం బేగంపేట నుంచి వేములవాడ చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆ తరువాత ఆలయంలోని మహానందికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

గోమాతకు కూడా పూజలు నిర్వహించిననంతరం ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ రాజరాజేశ్వర స్వామి గర్భాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు మోదీకి తిలకధారణ చేసి స్వామివారికి పుష్పార్చనలు నిర్వహించారు. తదనంతరం హారతి కళ్లకు అద్దుకుని మొక్కులు చెల్లించుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు, వేద పండితులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆపై శాలువా కప్పి సన్మానించారు. స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఇక తిరుగుపయనం అయ్యే క్రమంలో క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ, వందనం చేస్తూ బయటకు వచ్చారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో వేములవాడ బహిరంగ సభకు బయలుదేరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..