CM Jagan: ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు.. జగన్ సంచలన కామెంట్స్

CM Jagan: ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు.. జగన్ సంచలన కామెంట్స్

Ram Naramaneni

|

Updated on: May 07, 2024 | 1:17 PM

ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్‌ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని సీఎం జగన్ విమర్శించారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్‌కు ఓటు వేయరా? అని ప్రశ్నించారు. జగన్‌ ఏదైతే బటన్‌లు నొక్కాడో.. ఆ బటన్‌లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారని జగన్ ఫైరయ్యారు.

ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్‌. అక్కచెల్లెమ్మలకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారని.. వీళ్లు పథకాలను అడ్డుకున్నా.. వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు జగన్‌. జూన్‌ 4 తర్వాత ఆగిన పథకాల నగదును అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేస్తామన్నారాయన. 2019లో ప్రజలంతా కలిసి సైకిల్‌ని విరిచేశారన్నారు సీఎం జగన్‌. ఆ తప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసేందుకు చంద్రబాబు ముందు ఎర్రచొక్కాల పంచన చేరాడని.. వారితో పనికాదని తెలిసి దత్తపుత్రుడిని ఆశ్రయించాడని అన్నారు. ఆ తర్వాత వదినమ్మతో కలిసి ఢిల్లీ పెద్దలను ఆశ్రయించాడన్నారు. ఇప్పుడు సైకిల్‌ బెల్‌ మాత్రమే మిగిలిందని.. ఆ బెల్లే వారి అబద్ధాల మేనిఫెస్టో అని విమర్శలు చేశారు జగన్‌. దేవుడి దయ.. ప్రజలు దీవెనలు ఉన్నంత వరకు తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు సీఎం జగన్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..