మల్టీప్లెక్స్‌లో సినిమాకొచ్చి కళ్లు తేలేసిన మహిళ.. ఇంటర్వెల్‌లో సమోసా ఆర్డర్ చేయగా..
సాధారణంగా సినిమా చూడడానికి వెళ్లినప్పుడు కూల్ డ్రింక్ , పాప్ కార్న్ , సమోసా తింటూ మూవీ చూస్తాం.. అయితే మల్టీప్లెక్స్ థియేటర్ కి సినిమాకి వెళ్లిన ఓ మహిళ విరామం సమయంలో సమోసాలు కొనుగోలు చేసింది. సినిమా థియేటర్ లోకి వచ్చి తిందాం అనుకోని దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. వాటికి..

సాధారణంగా సినిమా చూడడానికి వెళ్లినప్పుడు కూల్ డ్రింక్ , పాప్ కార్న్ , సమోసా తింటూ మూవీ చూస్తాం.. అయితే మల్టీప్లెక్స్ థియేటర్ కి సినిమాకి వెళ్లిన ఓ మహిళ విరామం సమయంలో సమోసాలు కొనుగోలు చేసింది. సినిమా థియేటర్ లోకి వచ్చి తిందాం అనుకోని దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. వాటికి బూజు పట్టి ఉండటంతో ఆమె వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన ఓ మహిళ కుటుంబంతో కలిసి పటమటలోని ఎల్ఈపీఎల్ ఐనాక్స్ థియేటర్ కి వెళ్లారు.. కుటుంబ సభ్యులతో కలిసి మూవీ చూస్తూ ఫస్ట్ హాఫ్‌ను ఎంజాయ్ చేశారు. విరామం సమయంలో పిల్లల కోసం సమోసాలు, పాప కార్న్ తీసుకున్నారు. సమోసాలు తినడానికి చూడగా వాటి నుంచి కుళ్ళిపోయిన దుర్వాసన వచ్చింది.. దీంతో వాటిపై మహిళకు అనుమానం వచ్చింది. సమోసాను తుంచి చూడగా లోపల బూజు పట్టి ఉంది. దీంతో అక్కడి సిబ్బందిని ఆ మహిళ ప్రశ్నించింది. వారు సమోసాలను బయట నుంచి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. మార్కెట్లో 20 రూపాయలకు కొనుగోలు చేసి.. మాల్ లో 120 రూపాలయకు అమ్ముతున్నారని బాధిత మహిళ ఆరోపిస్తుంది. ఫుడ్ స్టాల్ నిర్వాహకులు మల్టీప్లెక్స్ మేనేజర్ ను అడిగిన ఎటువంటి సమాధానం దొరకలేదు.. ఈ క్రమంలో అక్కడే ఉన్న షిఫ్ట్ ఇంచార్జ్ బాధితులతో మాట్లాడదామని.. ఆఫీస్ లోనికి రావాలని కోరారు. అయితే ఏం మాట్లాడినా ఇక్కడే మాట్లాడాలని చెప్పడంతో సిబ్బంది అక్కడ నుంచి జారుకున్నారు..
తమకు జరిగిన అన్యాయాన్ని మరి ఎవరికీ జరగకూడదు అంటూ ఆ మహిళ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. దీంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయం ఫుడ్ సేఫ్టీ అధికారులకు చేరటంతో.. థియేటర్ తనిఖీలు చేపట్టారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై మల్టీప్లెక్స్ మేనేజ్‌మెంట్ స్పందించింది. సమోసాలు బాగోలేదని ఆమె చెప్పడంతో వేరేవి ఇస్తామని, లేదంటే డబ్బులు రిఫండ్ చేస్తామని తమ సిబ్బంది చెప్పినా ఆమె దుర్భాషలాడుతూ వెళ్లిపోయారని తెలిపారు. కాసేపటి తర్వాత వేరే వ్యక్తితో కలిసి వచ్చిన ఆమె తన స్కూటీ, ఇంటి తాళాలు పోయాయని.. మీరే తీశారంటూ గొడవకు దిగారని వెల్లడించారు. ఆమె తీరువల్ల ఇతరులు ఇబ్బంది పడుతుండటంతో తామే పోలీసులకు తామే సమాచారం ఇచ్చామన్నారు.
బూజు పట్టిన సమోసాలు వీడియో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..