Visakhapatnam: మద్యం లారీ బోల్తా.. మందు బాటిళ్లను దొరికిన కాడికి దొరికినంత దోచేశారుగా..
అప్పటికే మద్యం తీసుకెళ్లేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. భారీ క్రేన్ సహాయంతో లారీని యధావిధిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టైర్ పంచర్ అవడంతో లారీ బోల్తా పడ్డట్టు సమాచారం, ఆనందపురం డిపో నుంచి విశాఖ వైపు వెళ్తున్న సమయంలో మద్యం లారీ బోల్తా పడింది.

మధురవాడ కొమ్మది వద్ద మద్యం లారీ బోల్తా పడింది. దీంతో రోడ్డు పై మద్యం బాటిల్స్ భారీగా పడిపోయాయి. అదే సమయంలో వేరే బందోబస్తు కు వెళ్తున్న పోలీసులు ఆగి బోల్తా పడ్డ మద్యం లారీకి పహారా కాశారు. అప్పటికే మద్యం తీసుకెళ్లేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. భారీ క్రేన్ సహాయంతో లారీని యధావిధిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టైర్ పంచర్ అవడంతో లారీ బోల్తా పడ్డట్టు సమాచారం, ఆనందపురం డిపో నుంచి విశాఖ వైపు వెళ్తున్న సమయంలో మద్యం లారీ బోల్తా పడింది. వేరే లారీ తెప్పించి మద్యం ను షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. బాటిల్స్ కిందపడిపోవడంతో మందుబాబులు చేతికందినాన్ని బాటిల్స్ ను ఎత్తుకెళ్లారు.
బోల్తా కొట్టిన మద్యం లారీ..రోడ్డు పై పడిపోయిన మద్యం బాటిల్స్
పండగ చేసుకున్న మందు బాబులు.. రోడ్డు పై పడిన బ్యాటిల్స్ ఎత్తుకెళ్తున్న జనాలు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..