- Telugu News Photo Gallery Andhra Pradesh: Indefinite strike of tourism contract workers Araku Valley Hill Station
Araku Vally: ఆంధ్రాకశ్మీర్ అరకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ ప్లాన్ మార్చుకోండి!
దీపావళి హాలిడేస్ కు ఈ సారి అరకు, లంబసింగి వెళ్ళాలన్న ప్లాన్ లో ఉన్నారా? అయ్యో .. అయితే వేగంగా మీ ప్లాన్ మార్చుకోండి. ఎందుకనుకుంటున్నారా? అరకు వ్యాలీ లో కనువిందు చేసే పర్యాటక కేంద్రాలన్నీ తాత్కలికంగా మూత బడనున్నాయి. ఎప్పుడు తెరుస్తారో తెలీదు. తాత్కాలికమే అయినా ప్రస్తుతానికి ఇక్కడి ప్రాంతాలను సందర్శించే ఆలోచన అయితే విరమించుకోండి. ఇప్పటికే బయల్దేరి ఉంటే సమీపంలోని మరో పర్యాటక ప్రాంతాన్ని ఎంచుకోవటం ఉత్తమం. అసలు అరకులోని పర్యాటక ప్రదేశాల మూసివేతకు గల కారణాలేంటో తెలుసుకుందాం..
Eswar Chennupalli | Edited By: Surya Kala
Updated on: Nov 11, 2023 | 9:55 AM

సాధారణంగా వింటర్ స్టార్ట్ అవుతుందంటే విశాఖ ఏజన్సీ ప్రాంతాలకు వెళ్లాలని తెలుగు రాష్ట్రాల తో పాటు పొరుగు రాష్ట్రాల ప్రక్రుతి ప్రేమికులు చాలామంది ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే దట్టమైన మంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, వాటి మధ్య ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు లో ఆ ప్రయాణం భూలోక స్వర్గం నే. అలాంటి అందాలకు విశాఖ ఏజెన్సీ పుట్టినిల్లు గా విరాజిల్లుతోంది. అందుకే ఈ సీజన్ లో చాలామంది పర్యాటకులు అరకు, లంబసింగి లాంటి ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు.

కొత్తగా వెలుగు చూసిన వంజంగి మేఘాల కొండ. ఇక ఆ మేఘాల కొండ అందాలు ప్రత్యక్షం గా చూస్తే కానీ మాటల్లో వర్ణించలేం. అక్కడ నుంచి సూర్యోదయం చూడడం అంటే ఇక ఆ జన్మ ధన్యం అయినట్టే. అందుకే సూర్యోదయానికి ముందే అక్కడకు నిత్యం వేలాది మంది చేరుకుంటారు.

దశాబ్దానికి పైగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలన్నది టూరిజం కార్మికుల ప్రధాన డిమాండ్. ప్రతిసారి తమను మోసగిస్తున్న టూరిజం శాఖకు ఈసారి బుద్ధి చెప్పేందుకు , 11 నుండి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు టూరిజం కార్మికులు హెచ్చరించారు. సమస్యల పూర్తి పరిష్కారం వరకు విరమించేది లేదనీ కార్మికులు అంటున్నారు. ఉమ్మడి విశాఖ మన్యంలోని ఐదు టూరిజం క్షేత్రాలలో రాష్ట్ర టూరిజం లో అత్యధికంగా ఆదాయం వస్తుంది.

అనంతగిరి మండలంలోని తైడా, బొర్రా, హరిత రిస్సార్ట్స్, అరకులోయలోని మయూరి, పున్నమి, ట్రైబల్ మ్యూజియం, కొల్లాపూట్, చింతపల్లి సమీపంలోని లంబసింగి పర్యాటక క్షేత్రాలలోనీ టూరిజం రిసార్ట్స్ పై కార్మికుల సమ్మె ప్రభావం ఉండబోతోంది.

విశాఖ ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలలో పనిచేసే వాళ్లంతా కార్మికులే. సుమారు 300 మందికి పైగా పనిచేస్తున్న కార్మికులు అంతా గిరి పుత్రులే కావడం, వాళ్ళతో టూరిజం శాఖ వెట్టి చాకిరీ చేయించుకుంటుందే తప్ప వారికి న్యాయం చేయడం లేదన్నది కార్మికుల ఆవేదన. వీరిలో అనేకమంది 20 - 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారు ఉన్నారు. కొందరైతే రిటైర్ కూడా అయిపోయారు.

ప్రతి ఏడాది సమ్మె ప్రారంభించగానే అధికారులు వచ్చి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు కూడా నిర్లక్ష్యం చేయటం కార్మిక నాయకులను విజయవాడ పిలిచి హామీలు ఇచ్చి తర్వాత అవన్నీ "తూచ్" అని చెప్పటం.. దీనితో కథ మొదటికి రావడం జరుగుతూ వస్తూందు.

ఈ సారి అలా కుదరదంటూ గత నెల అక్టోబర్ 22 నుండి నుండి సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి. దీన్తో ఎమ్మెల్సీ రవిబాబు నేతృత్వంలో మధ్యవర్తిత్వం వహించి పది రోజులు సమయం కావాలని అడిగినా ప్రభుత్వం నుండి కార్మిక సంఘాలకు నవంబర్ 7 వరకు ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చివరిగా బొర్రా లో జరిగిన అఖిలపక్షం సమావేశం లో 11 నుండి తప్పనిసరిగా నిరవధిక సమ్మెలో పాల్గొనేందుకు కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకుని నేటినుంచి సమ్మె లో పాల్గొంటున్నాయి.





























