- Telugu News Photo Gallery Spiritual photos Diwali 2023: Govardhan puja bhai dooj dressing tips to look stylish during festive season
Diwali 2023: శుభం కోసం,స్టైల్‌లుక్ కోసం ఛోటీ దీపావళి నుంచి అన్నాచెల్లెల పండగ వరకూ ఈ రంగుల దుస్తులు ధరించండి
నరక చతుర్దశిని ఈ రోజు.. దీపావళి నవంబర్ 12 న లక్ష్మీ దేవి, గణపతిని పూజిస్తారు. వరసగా గోవర్ధన పండుగ, నాగుల చవితి, 15న భాయ్ దూజ్ పండుగను జరుపుకోనున్నారు. ఈ పండగ రోజుల్లో ప్రతి ఒక్కరు స్టైలిష్ గా, ఫ్యాషనబుల్ గా కనిపించాలని కోరుకుంటారు. అయితే స్టైల్ తో పాటు పండుగ వైబ్స్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పండగ రోజుల్లో ఆకర్షణీయమైన, అద్భుతమైన రూపాన్ని పొందాలనుకుంటే .. కొన్ని ప్రకాశవంతమైన రంగులను ఎంచుకోవాలి. కొన్ని రంగులన్నీ శుభప్రదంగా పరిగణించబడతాయి. అదే సమయంలో ఆ రంగులు మంచి రూపాన్ని కూడా ఇస్తాయి.
Updated on: Nov 11, 2023 | 9:31 AM

పండుగల సీజన్‌లో ప్రతిరోజు ఒక్కో రంగులో ఉండే దుస్తులను ఎంపిక చేసుకుని ధరించాలనుకుంటారు. నరక చతుర్దశి నుంచి అన్న చెల్లెల పండగ వరకు ఏ రోజు కోసం మీరు ఏ రంగు దుస్తులను ఎంచుకోవచ్చో తెలుసుకుందాం..

నరక చతుర్దశి లేదా ఛోటీ దీపావళి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసే సంప్రదాయం ఉంది. అనంతరం గ్రే లేదా రాయల్, నేవీ బ్లూ కలర్‌ను ఎంచుకోవచ్చు. ఈ రంగులన్నీ చాలా ఆకర్షణీయమైన, స్టైలిష్ రూపాన్ని అందిస్తాయి. పూజ సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు.

దీపావళి రోజున గులాబీ, ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులను ధరించవచ్చు. ఈ మూడు రంగులు చాలా ప్రకాశవంతమైనవి.. పండుగ సీజన్‌లో ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి. ఈ రంగులు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.

గోవర్ధన్ పూజ రోజున ఆకుపచ్చ, పసుపు రంగుల దుస్తులను ధరించవచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి పసుపు రంగును ఇష్టపడతాడు.. ఆకుపచ్చ రంగు ప్రకృతితో ముడిపడి ఉంటుందని నమ్ముతారు. గోవర్ధనుడితో పాటు ప్రకృతి పట్ల కృతజ్ఞతని తెలుపుతూ జరుపుకునే పండుగ. పండుగ రోజుల్లో పసుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులు కూడా బాగుంటాయి.

అన్నచెల్లెల పండగ సోదరి, సోదరుల మధ్య బలమైన అనుబంధానికి ప్రతీక. ప్రతి ఒక్కరికీ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున సోదరుడు సోదరి నారింజ రంగులో దుస్తులను ధరించాలి. లేదా పాస్టెల్ రంగులను ఎంచుకోవచ్చు. ఈ రంగుల దుస్తులను ధరిస్తే మంది అందంగా కనిపిస్తారు. ప్రస్తుతం మిర్రర్ వర్క్ కుర్తా, చీర రెండూ ట్రెండ్‌లో ఉన్నాయి. కనుక నారింజ రంగు దుస్తుల్లో మిర్రర్ వర్క్ ఉన్నవి ధరిస్తే మంచి రూపం లభిస్తుంది.





























