ఈ నెల 12, 13 తేదీలలో తులా రాశిలో రెండు బ్రహ్మాండమైన యోగాలు చోటు చేసుకుంటు న్నాయి. దీపావళి సందర్భంగా ఏర్పడుతున్న ఈ రెండు యోగాలూ తప్పకుండా కొన్ని రాశుల వారి తలరాతలను మార్చే అవకాశం ఉంది. ఇందులో ఒకటి గజకేసరి యోగం కాగా, మరొకటి చంద్ర మంగళ యోగం. చంద్ర మంగళ యోగాన్ని మహా లక్ష్మీ యోగం అని కూడా అంటారు. తులా రాశిలో కుజ, చంద్రులు కలవడం వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడుతుండగా, మేష రాశిలో ఉన్న గురువు చంద్రుడిని సప్తమ దృష్టితో వీక్షించడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. చంద్ర మంగళ యోగం వల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి అవకాశం ఉంటుంది. గజకేసరి యోగం వల్ల కూడా ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా మహాయోగం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు యోగాలు ఏకకాలం పట్టే రాశులుః మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం.