- Telugu News Photo Gallery Do you know why 'Yama Deepam' is lit on dhanteras day?, check here is details
Spirituality Tips: ధన త్రయోదశి రోజు ‘యమ దీపం’ ఎందుకు వెలిగిస్తారో తెలుసా!
హిందూ పండగల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. కార్తీక మాసంలో కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు ధన త్రయోదశిని జరుపుకుంటారు. ఈ రోజున చాలా మంది ఇంట్లో లక్ష్మీ దేవికి ప్రత్యేకంగా పూజించి.. బంగారం లేదా వెండి ఆభరణాలను కొంటారు. ధన త్రయోదశి రోజు వెండి లేదా బంగారు ఆభరణాలు లేదా వస్తువులు కొంటూంటారు. ఈ రూపంలో లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అదే రోజు సాయంత్రం లక్ష్మీ దేవి, కుబేరుడిని భక్తి శ్రద్ధలతో..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 11, 2023 | 8:45 PM

హిందూ పండగల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. కార్తీక మాసంలో కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు ధన త్రయోదశిని జరుపుకుంటారు. ఈ రోజున చాలా మంది ఇంట్లో లక్ష్మీ దేవికి ప్రత్యేకంగా పూజించి.. బంగారం లేదా వెండి ఆభరణాలను కొంటారు. ధన త్రయోదశి రోజు వెండి లేదా బంగారు ఆభరణాలు లేదా వస్తువులు కొంటూంటారు. ఈ రూపంలో లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

అదే రోజు సాయంత్రం లక్ష్మీ దేవి, కుబేరుడిని భక్తి శ్రద్ధలో పూజిస్తారు. అంతే కాదు ఇదే రోజున యముడికి కూడా కొంత మంది పూజిస్తూంటారు. యమరాజుకు దీపాన్ని పెట్టి, పూజిస్తారు. ధన త్రయోదశి రోజునే ఎందుకు యముడికి దీపం వెలిగిస్తారు? దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం.. ధన త్రయోదశి రోజు యముడికి దీపం వెలిగిస్తే సంతోషిస్తాడట. కుటుంబ సభ్యుల భద్రత కోసం ఈ దీపం వెలిగిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని యమ రాజుకు దీప దానం, యమ దీపం అని కూడా అంటారు.

ధన త్రయోదశి రోజు సాయంత్రం మాత్రమే యమ దీపం వెలిగిస్తారు. ప్రత్యేకంగా యమ సమయం అని ఉంటుంది. కాబట్టి సాయంత్రం 5:30 నుంచి 6.49 వరకు దీపాన్ని వెలిగించ వచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ యమ దీపాన్ని ఎలా వెలిగిస్తారంటే: వరి పిండి తీసుకుని నాలుగు ముఖాల దీపాన్ని తయారు చేసుకోవాలి. ఇందులో ఆవ నూనె వేసి నాలుగు ఒత్తులు పెట్టి.. ఇంటి బయట దక్షిణ దిశగా ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం పెట్టడం వల్ల కుటుంబం మొత్తం ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటారని నమ్మిక.





























