Rewind 2025: ఈ ఏడాది చెత్త ప్లేయర్స్ వీళ్లే.. కెరీర్‌లోనే సిగ్గుపడే రికార్డ్..
Most Ducks in 2025 in All Formats: 2025 సంవత్సరం కొంతమంది ఆటగాళ్లకు ఏమాత్రం కలిసిరాలేదు. ఈ ఏడాది అత్యధిక సార్లు డకౌట్ (సున్నా పరుగులకే అవుట్) అయిన ఐదుగురు ఆటగాళ్ల వివరాలు ఓసారి చూద్దాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు సూపర్ స్టార్ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి.

Rewind 2025: ఈ ఏడాది చాలా మంది బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించగా, మరికొందరు మాత్రం కొన్ని అవాంఛనీయ రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. అందులో ముఖ్యమైనది ‘అత్యధిక సార్లు సున్నాకే అవుట్ అవ్వడం’. ఈ లిస్ట్‌లో పాకిస్థాన్ ఆటగాడు నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అలాగే, టీమిండియా ప్లేయర్ కూడా ఉన్నాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1. సైమ్ అయూబ్ – నంబర్ 1 ‘జీరో’ పాకిస్థాన్ ఎడమచేతి వాటం బ్యాటర్ సైమ్ అయూబ్ 2025లో అత్యధిక సార్లు సున్నాకే అవుట్ అయ్యాడు. ఈ ఆటగాడు మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 8 సార్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. సైమ్ అయూబ్‌కు 2025 ఒక పీడకలగా మిగిలిపోనుంది. అతను ఆడిన 37 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు డకౌట్ అవ్వగా, అతని బ్యాట్ నుంచి 22.6 సగటుతో కేవలం 817 పరుగులు మాత్రమే వచ్చాయి.
2. రోస్టన్ చేజ్ – రెండో స్థానం వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ కూడా డకౌట్ అవ్వడంలో చాలా వేగంగా కనిపించాడు. ఈ ఆటగాడు మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 44 ఇన్నింగ్స్‌లు ఆడగా, అందులో 7 సార్లు సున్నాకే పెవిలియన్ చేరాడు. ఇతను 20.05 సగటుతో 802 పరుగులు సాధించాడు.
3. షాహీన్ షా ఆఫ్రిది – టాప్ 3 ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వ దేశాల ఆటగాళ్లలో 2025లో అత్యధిక సార్లు డకౌట్ అయిన వారిలో షాహీన్ షా ఆఫ్రిది మూడో స్థానంలో ఉన్నాడు. పాక్ స్టార్ బౌలర్ అయిన షాహీన్, మూడు ఫార్మాట్లలో ఆడిన 23 ఇన్నింగ్స్‌ల్లో 6 సార్లు ఖాతా తెరవలేకపోయాడు. షాహీన్ ఈ ఏడాది 11.2 సగటుతో 168 పరుగులు చేశాడు.
4. జేడెన్ సీల్స్ – నాలుగో స్థానం వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ 2025లో 6 సార్లు సున్నాకే అవుట్ అయ్యాడు. ఇతను ఆడిన 24 ఇన్నింగ్స్‌ల్లో 6 సార్లు డకౌట్ అయ్యాడు. సీల్స్ 11.13 సగటుతో 167 పరుగులు చేశాడు.
5. షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ – ఐదో స్థానం తన మెరుపు బ్యాటింగ్‌కు పేరుగాంచిన షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ కూడా 2025లో సున్నా సెగను అనుభవించాడు. 25 ఇన్నింగ్స్‌ల్లో ఇతను 6 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. రూథర్‌ఫర్డ్ సగటు కేవలం 16.2 మాత్రమే ఉండగా, అతను 406 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 2025లో ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




