Andhra Pradesh: ప్రియుడి మోజులో సుపారి ఇచ్చి మరీ పెనివిటి ప్రాణం తీసింది.. స్నేహ ఎంత పని చేశావ్..
అడవి బాటలో పోలీసులు.. వెళ్ల వెళ్లగా ఓ చోట వెదకబోయిన శవం కళ్లకు కన్పించింది. ఈ డెడ్‌బాడీ అతనిదేనా..? మిస్సింగ్ కేసుగా కూపీలాగితే తెరపైకి సుపారీ మర్డర్ క్రైమ్ కథా చిత్రమ్....
చిత్తూరు జిల్లా కుప్పం మండలం గరిగెచిన్నేపల్లి హరీష్ అనే వ్యక్తి సొంతూరు. ఈయన భార్య పేరు స్నేహ. వాళ్లది పెద్దలు కుదుర్చిన పెళ్లి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. హరీష్ హైదరాబాద్‌లో ఓ ప్రయివేటు కంపెనీలో జాబ్ చేసేవాడు. స్నేహ కుప్పంలోని ఓ హాస్పిటల్‌లో నర్స్. ఉద్యోగ రీత్యా వేరు వేరు వున్నా ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు. పట్నం నుంచి వచ్చినప్పుడల్లా భార్యకు గిప్ట్‌లు తెచ్చేవాడు. ఆమె ఎంతో సంతోషించేది. తను మళ్లీ హైదరాబాద్ వెళ్లేవాడు. ఈలోపు కుప్పంలో కత సైడ్ ట్రాక్ పట్టింది. సతీష్ నాయక్‌తో పరిచయం .. స్నేహం..వివాహేతర సంబంధానికి దారి తీసింది. హరీష్ హైదరాబాద్‌లో ఉండగా..ఈ ఇద్దరు కుప్పంలో షికార్లు చేస్తున్నారు. హరీష్‌కు ఇదంతా తెలియదు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో ముందస్తు సమాచారం ఉండేది కాబట్టి ఆ ప్రకారం తమ షెడ్యూల్‌ను ఫిక్స్ చేసుకునేవాళ్లు ఈ ఇద్దరు. ఐతే ఓ రోజు కథ అడ్డం తిరిగింది. సతీష్.. హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇక ఇక్కడే వుంటానని చెప్పేశాడు. అంతే ఈ ఇద్దరికి గొంతులో వెలక్కాయపడ్డట్టయింది. తమ ఇల్లీగల్ యవ్వారినిక అడ్డు లేకుండా ఉండాలంటే సతీష్‌ను చంపడమే మార్గమని డిసైడయ్యారు.
తమ చేతికి మట్టి అంటకుండా మర్డర్ చేయించాలని నిర్ణయించుకున్నారు. సతీష్ తన ఫ్రెండ్స్‌కు విషయం చెప్పాడు. 5 లక్షల సుపారీ ఇవ్వడానికి ఓకే అనడంతో డీల్ కుదిరింది. 30వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. సతీష్ ఫ్రెండ్స్ కమ్ సుపారీ గ్యాంగ్ సీన్‌లోకి దిగారు. ఫలానా వాళ్లు డబ్లు ఇస్తామన్నారు తీసుకురండి అంటూ భర్తను బయటకు పంపిందామె. అప్పటికే అక్కడ మాటేసిన నిందితులు సతీష్‌పై దాడి చేసి హత్య చేశారు. శవాన్ని అడవిలో పడేశారు. ప్లాన్ వర్కవుటయింది. స్నేహ గ్లిజరిన్ కన్నీళ్లతో ఠాణా బాటపట్టింది. తన భర్త కన్పించడంలేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేపట్టారు. ఆక్రమంలోనే అడవిలో గుర్తు తెలియని శవం పడి వుందన్న సమాచారం అందింది. క్లూస్ ఆధారంగా కూపీలాగితే చనిపోయిన వ్యక్తి సతీషేనని నిర్దారణైంది. స్నేహను ప్రశ్నిస్తే టోటల్ క్రైమ్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది…
ప్రియుడి మోజులో పెనిమిటి ప్రాణం తీసిన స్నేహ.. ఆమె ప్రియుడు సతీష్ లతో పాటు 6 నిందితులను కటకటాల బాటపట్టించారు పోలీసులు. ఇలాంటివాళ్లను జైల్‌లో వేసి మేపడం కాదు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా వుండేలా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.