AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చింతకాయల విజయ్ ఇంట్లో సోదాలు.. అలా చేసినందుకేనంటూ క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఐడీ..

తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్ ఇంట్లో సోదాలు చేయడం, సీఆర్పీసీ 41A కింద నోటీసులు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ క్లారిటీ ఇచ్చింది. ఐటీడీపీ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

Andhra Pradesh: చింతకాయల విజయ్ ఇంట్లో సోదాలు.. అలా చేసినందుకేనంటూ క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఐడీ..
Ap Cid
Shiva Prajapati
|

Updated on: Oct 01, 2022 | 7:11 PM

Share

తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్ ఇంట్లో సోదాలు చేయడం, సీఆర్పీసీ 41A కింద నోటీసులు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ క్లారిటీ ఇచ్చింది. ఐటీడీపీ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, BharathiPay అని తప్పుడు వార్త ప్రచురించింది కూడా ఐటీడీపీ అని సీఐడీ అధికారులు ప్రకటించారు. ఈ ఐటీడీపీ చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నడుస్తోందని, ఆ కారణంగానే ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు పిలిచామన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు ఏపీ సీఐడీ అధికారులు. కాగా, విజయ్‌పై ఐపీసీ సెక్షన్ 419, 469, 153A, 505(2), 120B r/w 34, ఐటీ యాక్ట్ సెక్షన్ 66(c) కింద కేసు నమోదు చేసి, సీఆర్పీసీ సెక్షన్ 41-A కింద విచారణకు హాజరు కావాలని చింతకాయల విజయ్ కు నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. దర్యాప్తునకు సహకరించాలని విజయ్‌ను కోరారు అధికారులు.

అంతకుముందు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌‌లోని చింతకాయల విజయ్ ఇంటి వద్ద ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు హల్‌చల్ చేశారు. విజయ్ ఇంట్లోకి వచ్చి.. సోదాలు నిర్వహించారు. ఆయన లేకపోవడంతో సర్వెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా, విజయ్ లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించారు సీఐడీ పోలీసులు.

కాగా, ఈ ఏపీ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ్ కుటుంబ సభ్యులు. ఎందుకు వచ్చారో, కేసు ఏంటో కూడా చెప్పలేదని ఆరోపించారు కుటుంబ సభ్యులు. ఇంట్లో పిల్లలు ఉన్న సయమంలో పోలీసుల పేరుతో హల్‌చల్ చేశారని, అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియదని వారు అంటున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు నిర్వహించాలని తమను బెదిరించినట్లు విజయ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయపరమైన పోరాటం సాగిస్తామన్నారు విజయ్ కుటుంబ సభ్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్