AP – Telangana: నిండు కుండల్లా మారిన ప్రాజెక్టులు.. గరిష్ట స్థాయికి నీటిమట్టం

అల్పపీడన ప్రభావంతో. దంచికొట్టిన వానలతో ప్రాజెక్టుల్లో జళకళ పరవళ్లు తొక్కుతోంది. ఇన్‌ఫ్లో పెరగడంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. భద్రాచలం, ప్రకాశం బ్యారేజీల దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితక స్థావరాలకు తరలిస్తున్నారు.

AP - Telangana:  నిండు కుండల్లా మారిన ప్రాజెక్టులు.. గరిష్ట స్థాయికి నీటిమట్టం
Dowleswaram
Follow us

|

Updated on: Jul 21, 2024 | 8:28 PM

తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ఎడదెరపి లేని వర్షాలు,  ఎగువ నుంచి వస్తోన్న వరదలతో  గోదావరి, కృష్నా ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్టానికి చేరుకుంది.  భద్రచాలం దగ్గర గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో   మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అటు పోలవరం కు భారీగా ఇన్‌ఫ్లో పెరిగింది. 15 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ జితేష్‌. ముంపు గ్రామాల  ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు.

వరద పోటుతో  గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది.   శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ ..మిడ్‌ మానేరు, కిన్నెరసాని, తూపాకులగూడెం సమ్మక్క సాగర్‌ , కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లో పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  పోలవరం ప్రాజెక్ట్‌ స్పిల్‌వే ఎగువన 31.8 మీటర్ల నీటి మట్టం ఉంది. స్పిల్‌వే దిగువన 20.6 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. కాఫర్ డ్యామ్ ఎగువన 30.30 మీటర్ల నీటి మట్టం ఉండగా, దిగువన 20.15 మీటర్లు ఉంది. ఇక పోలవరం నుంచి 8,16,838 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో 175 గేట్లు ఎత్తివేసి  సముద్రంలోకి నీటిని  వదులుతున్నారు.  అటు  వానలు-వదరలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. జూరాల, తుంగభద్ర , నాగార్జునసాగర్‌ , శ్రీశైలం  ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి.  ప్రకాశం బ్యారేజీల్లో ఇన్‌ ఫ్లో అంతకంతకు పెరుగుతోంది.మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు కృష్ణా  రీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ధవళేశ్వరం దగ్గర వరద పోటెత్తుతోంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ని వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇటు కాళేశ్వరం పుష్కర ఘాట్‌,మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ దగ్గర నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది.  మరోవైపు మూసీ నది కూడా ఉధృతంగాప్రవహిస్తోంది . ఇక హైదరాబాద్‌ లో హుస్సేన్‌ సాగర్‌ , ఉస్మాన్‌ సాగర్‌ నిండు కుండలను తలపిస్తున్నాయి.

విశాఖ జిల్లా సీలేరు జలాశయానికి వరద నీటి తాకిడి ఎక్కువగా ఉంది. ఐస్‌ గెడ్డ, పిల్లి గెడ్డ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటవాడ రిజర్వాయర్‌ నీటి మట్టం గంటగంటకు పెరుగుతోంది.ఎప్పటికప్పుడు  పరిస్థితిని మానిటరింగ్‌ చేస్తున్నారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..