Elections 2024: మండుటెండలోనూ బారులు తీరిన ఓటర్లు.. పెద్ద ఎత్తున పోలింగ్ శాతం పెరిగే అవకాశం..
ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ శాతం గంటగంటకు పెరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనా తిరిగి పోలింగ్ శాతం పుంజుకుంది. చెదురుమొదలు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాధారణంగా జరుగుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత, కొత్తగా ఓటు హక్కువచ్చిన వారు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు.
ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ శాతం గంటగంటకు పెరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనా తిరిగి పోలింగ్ శాతం పుంజుకుంది. చెదురుమొదలు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాధారణంగా జరుగుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత, కొత్తగా ఓటు హక్కువచ్చిన వారు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు. ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా మధ్యాహ్నం 1 గంట వరకు 40.28శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు ఎన్నికల అధికారులు. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య చిన్న చిన్న సంఘటనలు మినహా మరెక్కడా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు తలెత్తలేదంటున్నారు అధికారులు. పురుషులకంటే కూడా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఏపీలో ఉదయం 1 గంటల వరకు 40.26 శాతం పోలింగ్ నమోదు..
- కడపలో 45.86 శాతం
- చిత్తూరులో 44.55శాతం
- బాపట్లలో 44.28 శాతం
- అల్లూరిలో 32.78 శాతం
- అనకాపల్లిలో 37.92 శాతం
- అనంతపురంలో 39.74 శాతం
- అన్నమయ్యలో 39.47 శాతం
- కృష్ణాలో 45.02 శాతం
- కోనసీమలో 44.02 శాతం
- నంద్యాలలో 26.58 శాతం
- విశాఖలో 33.69 శాతం
- ఏలూరులో 38.96 శాతం
- ప.గో.లో 39.60 శాతం
- నెల్లూరులో 42.28 శాతం
- కర్నూలులో 37.70 శాతం
- ప్రకాశంజిల్లాలో 42.67 శాతం
- ఎన్టీఆర్ జిల్లాలో 39.73 శాతం
- విజయనగరంలో 38.46 శాతం
- తూ.గో.లో 21.79 శాతం
- పల్నాడులో 40.48 శాతం
- శ్రీకాకుళంలో 40.73 శాతం
- తిరుపతిలో 39.10 శాతం
- గుంటూరులో 40.03 శాతం
- కాకినాడలో 38.24 శాతం
- సత్యసాయి జిల్లాలో 38.12 శాతం
- మన్యంజిల్లాలో 35.01 శాతం
తెలంగాణలో ఉదయం 1 గంటల వరకు 40.28 శాతం పోలింగ్ నమోదు..
- అదిలాబాద్ -50.18
- భువనగిరి -46.49
- చేవెళ్ల – 34.56
- హైద్రాబాద్ -19.37
- కరీంనగర్-45.11
- ఖమ్మం-50.63
- మహబూబాబాద్-48.81
- మహబూబ్నగర్-45.84
- మల్కాజిగిరి-27.69
- మెదక్-46.72
- నాగర్ కర్నూల్ -45.88
- నల్గొండ-48.48
- నిజామాబాద్-45.67
- పెద్దపల్లి-44.87
- సికింద్రబాద్-24.91
- వరంగల్-41.23
- జహీరాబాద్-50.71
ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..