AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Investors Summit: ఆకాశమే హద్దుగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌.. నేడు 248 ఎంవోయూలు చేసుకోనున్న జగన్‌ సర్కార్‌

విశాఖ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో అంచనాలకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయ్‌. అసలు, ఫస్ట్‌డే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ్‌?. ఇవాళ (మార్చి 4) చేసుకోబోయే ఎంవోయూలేంటి?

Global Investors Summit: ఆకాశమే హద్దుగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌.. నేడు 248 ఎంవోయూలు చేసుకోనున్న జగన్‌ సర్కార్‌
Global Investors Summit 2023
Basha Shek
|

Updated on: Mar 04, 2023 | 7:26 AM

Share

ఆకాశమే హద్దుగా సాగుతోంది గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌. నిర్దేశించుకున్న టార్గెట్‌ను క్రాస్‌ చేయడమే కాదు.. ఆరేడు రెట్లు ఎక్కువగా పెట్టుబడులు సాధించి చరిత్ర సృష్టించింది ఏపీ. విశాఖ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో అంచనాలకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయ్‌. అసలు, ఫస్ట్‌డే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ్‌?. ఇవాళ (మార్చి 4) చేసుకోబోయే ఎంవోయూలేంటి? గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో అంచనాలకు మించి పెట్టుబడులను సాధించింది ఏపీ. రెండు లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ టార్గెట్‌తో GISను నిర్వహిస్తే, అందుకు ఆరేడు రెట్లు ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయ్‌. అంతేకాదు, మొదటిరోజే మేజర్‌ ఎంవోయూలు జరిగిపోయాయ్‌. రెండో నాలుగు లక్షల కోట్లో కాదు, ఫస్డ్‌డే ఏకంగా 12లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరాయ్‌. మొదటిరోజు జరిగిన డీల్స్‌ తొంభై రెండే, కానీ వాటి విలువ మాత్రం 11.85లక్షల కోట్ల రూపాయలు. ఫస్ట్‌డే ఎంవోయూల ద్వారా దాదాపు నాలుగు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయంటోంది ప్రభుత్వం. ఇకరెండోరోజు, అంటే ఇవాళ 248 ఎంవోయూలు కార్యరూపం దాల్చనున్నాయ్‌. ఒప్పందాల నెంబర్‌ పెద్దగా కనిపిస్తున్నా.. వీటి విలువ మాత్రం లక్షా 15వేల కోట్ల రూపాయలే. ఈ డీల్స్‌ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయంటోంది ప్రభుత్వం. టోటల్‌గా రెండ్రోజుల్లో మొత్తం 340 ఎంవోయూలు జరగనున్నాయ్‌. ఈ ఒప్పందాల విలువ 13లక్షల కోట్ల రూపాయలు. ఈ పెట్టుబడుల ద్వారా 20 రంగాల్లో 6లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది ప్రభుత్వం మాట. పర్యావరణ హితం-కర్బన రహితం, రవాణా అండ్‌ మౌలిక వసతులు, సాంకేతికత, వ్యవస్థాపకత.. ఈ నాలుగే ఏపీ పారిశ్రామిక రంగానికి మూలస్థంభాలన్నారు సీఎం జగన్‌.

హాజరుకానున్న కేంద్రమంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు..

కాగా నేటి సదస్సులో కిషన్ రెడ్డి, సర్బానందసోనోవాలా, రాజీవ్ చంద్ర శేఖరన్ తదితర కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. అలాగే రెడ్డీస్ లాబోరేటరీ చైర్మన్ సతీష్ రెడ్డి, నోవా ఎయిర్ సీఈఓగజానన నాబర్, అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, లారస్ లాబ్స్ చైర్మన్ సత్యనారాయణ చావా, హెటిరో గ్రూప్స్ ఎండీ వంశీకృష్ణ బండీ, గ్రీన్ కో డైరెక్టర్ అనిల్ కుమార్ చలమలశెట్టి, సెయింట్ గోబైన్ సీఈఓ సంతానం, అపాచి హిల్ టాప్ హెడ్ సెరిగో లీ, బ్లెండ్ హబ్ వ్యవస్థాపకుడు హెన్ రిక్ స్టామ్ , వీస్పన్ గ్రూప్ ఎండీ రాజేష్ మందావే వాలా, భారత్ బయోటెక్ చైర్ పర్సన్ సుచిత్ర ఎల్లా తదితర పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇక మధ్యాహ్నం 12.45 నుంచి 1.05 వరకు ముఖ్యమంత్రి జగన్‌ ముగింపు ఉపన్యాసం ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..