టీడీపీ కార్యాలయంలో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

నల్గొండలో టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య బాహాబాహి జరిగింది. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన నేతలు ఆ సమావేశానికి రావడంపై అక్కడున్న కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అయితే తెలంగాణాలో దాదాపుగా టీడీపీ ఖాళీ అయిపోయింది. ఆ పార్టీలోని కీలక నేతలందరూ వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. మరికొందరు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. 

  • Tv9 Telugu
  • Publish Date - 3:38 pm, Fri, 13 September 19