ఆరోగ్యశ్రీ పేరుతో ఫేక్ కాల్: రూ.18 వేలు మాయం..!

ఆరోగ్యశ్రీ పేరుతో రైతును నిండా ముంచాడో ఘరానా మోసగాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం పూసాల గ్రామానికి చెంది రంగయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆరోగ్యశ్రీ నుంచి మీకు డబ్బులు వచ్చాయి. బ్యాంక్‌ అకౌంట్లు, ఏటీఎం నెంబర్లు చెప్పమన్నాడు. దీంతో రంగయ్య అన్ని వివరాలు చెప్పాడు. చివరికి ఓటీపీ నెంబర్లను కూడా ఫోన్‌ చేసి తెలుసుకున్నాడు అగంతకుడు. చదువురాని రంగయ్యను ఫోన్‌ కాల్స్‌తో మాయ చేశాడా అగంతకుడు. […]

ఆరోగ్యశ్రీ పేరుతో ఫేక్ కాల్: రూ.18 వేలు మాయం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 13, 2019 | 2:11 PM

ఆరోగ్యశ్రీ పేరుతో రైతును నిండా ముంచాడో ఘరానా మోసగాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం పూసాల గ్రామానికి చెంది రంగయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆరోగ్యశ్రీ నుంచి మీకు డబ్బులు వచ్చాయి. బ్యాంక్‌ అకౌంట్లు, ఏటీఎం నెంబర్లు చెప్పమన్నాడు. దీంతో రంగయ్య అన్ని వివరాలు చెప్పాడు. చివరికి ఓటీపీ నెంబర్లను కూడా ఫోన్‌ చేసి తెలుసుకున్నాడు అగంతకుడు.

చదువురాని రంగయ్యను ఫోన్‌ కాల్స్‌తో మాయ చేశాడా అగంతకుడు. తనకు మెసేజ్‌లు వస్తుంటే డబ్బులు పడుతున్నాయేమో అని అనుకున్నాడు రంగయ్య. అయితే ఓటీపీ నెంబర్లు ఎక్కువగా వస్తుండటంతో అనుమానం వచ్చి బ్యాంకు దగ్గరకు వెళ్లాడు. మేనేజర్‌ని అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నాడు. డబ్బులు రావడం దేవుడెరుగు.. అకౌంట్లో ఉన్న తన డబ్బే మాయం అయిందని గుర్తించాడు. తన రెండు అకౌంట్లలో 18 వేలు మాయం అయ్యాయని వాపోయాడు.