AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాఫ్ట్‌వేర్‌ లోపాలతో రెస్టారెంట్ల బిల్లింగ్ స్కామ్.. బిర్యానీ హోటళ్ల తనిఖీల్లో బయటపడ్డ వాస్తవాలు!

కిల్‌ 'బిల్‌' పాండేలకు అడ్డాగా మారాయి కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్. వీళ్లు చేస్తున్న మాయాజాలంతో ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోతోంది. బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలతో కొంతమంది నిర్వాహకులు ప్రభుత్వం కళ్లకు గంతలు కడుతున్నారు. అసలేంటి ఈ బిల్లింగ్ స్కామ్..? ఇది ఎలా జరుగుతుంది?

సాఫ్ట్‌వేర్‌ లోపాలతో రెస్టారెంట్ల బిల్లింగ్ స్కామ్.. బిర్యానీ హోటళ్ల తనిఖీల్లో బయటపడ్డ వాస్తవాలు!
Restaurant Billing Scam
Balaraju Goud
|

Updated on: Mar 08, 2026 | 7:48 PM

Share

కిల్‌ ‘బిల్‌’ పాండేలకు అడ్డాగా మారాయి కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్. వీళ్లు చేస్తున్న మాయాజాలంతో ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోతోంది. బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలతో కొంతమంది నిర్వాహకులు ప్రభుత్వం కళ్లకు గంతలు కడుతున్నారు. అసలేంటి ఈ బిల్లింగ్ స్కామ్..? ఇది ఎలా జరుగుతుంది?

ఆంధ్రప్రదేశ్‌లోని పలు రెస్టారెంట్లలో సోదాలు నిర్వహించింది ఆదాయ పన్ను శాఖ. విశాఖలోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్‌తో పాటు 4 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులను డిజిటల్‌గా తొలగించినట్టు ఆధారాలు లభించడంతో.. ఆన్‌లైన్‌ పేమెంట్లు, డిజిటల్ డేటాపై అధికారులు ఫోకస్ పెట్టారు. దీంతో కంప్యూటర్‌ డేటాను పరిశీలించారు. అలాగే నెల్లూరు వెంగమాంబ రెస్టారెంట్‌తో పాటు రాజమండ్రి బార్కాస్‌ అరేబియన్‌ మండిలోనూ ఐటీ సోదాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన డిజిటల్‌ రికార్డులు తొలగించినట్లు ఆధారాలు లభించడంతో ఈ తనిఖీలు జరిగాయి.

కస్టమర్ల నుండి వసూలు చేసిన జీఎస్టీని ప్రభుత్వానికి కట్టకుండా ఓ ప్లాన్ ప్రకారం ఎగ్గొడుతున్నాయి..కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్. వీళ్లు చేస్తున్న మాయాజాలంతో ఏటా వేలకోట్ల రూపాయలు నష్టపోతోంది ప్రభుత్వం. గత ఈ ఐదేళ్ల కాలంలో అక్షరాల 70వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ను రెస్టారెంట్లు దాచిపెట్టినట్టు ఇటీవల గుర్తించారు అధికారులు. హైదరాబాద్‌లోని ఓబిర్యానీ ఓహోటల్‌కు సంబంధించిన బ్రాంచ్‌లలో తనిఖీ చేయగా ఈ వాస్తవాలు బయటపడ్డాయి. టిఫిన్ సెంటర్ల నుంచి పబ్‌ల వరకూ, రెస్టారెంట్ల నుంచి హోటల్స్ వరకూ అవకాశమున్న ప్రతిచోటా జీఎస్టీతో పాటు ఐటీ ఎగ్గొట్టినట్లు తేల్చారు అధికారులు.

మొత్తం నాలుగు లేయర్లలో బిల్లింగ్ స్కామ్ జరుగుతున్నట్ల ఐటీ అధికారుల రైడ్‌లో తేలింది.మనం కట్టిన బిల్ బయటికి జెన్యూన్‌గానే కనిపించినా, సాఫ్ట్‌వేర్ మాయాజాలంతో మనం కట్టిన బిల్లులు మొత్తం గాయబ్ అయిపోతున్నాయి. రెస్టారెంట్లు, హోటల్స్ ఉపయోగించే బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లోనే ఈగోల్‌మాల్ జరుగుతోంది. మనం కట్టిన బిల్ ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక..బ్యాక్‌ఎండ్ యాక్సెస్ ద్వారా బిల్లింగ్ డేటా మొత్తం చేంజ్ అయ్యేలా చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో మొత్తం30 రోజుల డేటాను ఒకేసారి తొలగించేలా బల్క్ డిలీషన్ కూడా జరుగుతుంది. దీంతో జీఎస్టీతో పాటు టర్నోవర్‌ కూడా మాయమైపోతోంది. ఐటీ అధికారులు గుజరాత్‌లో ఉన్న మెయిన్ సర్వర్‌కు వెళ్లి అక్కడ బ్యాక్ ఎండ్ డేటాను పరిశీలించగా టోటల్ స్కామ్ బయటపడింది.

రాష్ట్రాల వారీగా డిలీషన్ వివరాలు చూస్తే కర్నాటక టాప్‌ప్లేస్‌లో ఉండగా సెకండ్ ప్లేస్‌లో తెలంగాణ,థర్డ్‌ ప్లేస్‌లో తమిళనాడు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నట్లు ఐటీ లెక్కల్లో తేలింది. జీఎస్టీ బిల్ మాయాజాలంపై దేశవ్యాప్తంగా ఐటీ అలర్ట్ అయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరెక్ట్ టాక్సెస్ దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే ఏపీలోని విశాఖ, రాజమండ్రి, నెల్లూరులో ముమ్మర తనిఖీలు జరిగాయి. మరి ఈ స్కామ్‌లో ముందు ముందు ఎలాంటి సంచనాలు వెలుగుచూస్తాయో చూడాలి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us