నేటి నుంచి వైఎస్సార్ చేయూత దరఖాస్తులు స్వీకరణ

వైఎస్సార్ చేయూత పథకం దరఖాస్తులను నేటి నుంచి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కేంద్రాల్లో స్వీకరించనున్నట్లు డీటీసీ మీరా ప్రసాద్ వెల్లడించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు, యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత పథకం కింద రూ. 10 వేల అర్థిక సహాయాన్ని అందించనుంది. అయితే దీనికి సంబంధించిన దరఖాస్తులను పూర్తి చేసి రవాణా శాఖ కార్యాలయాల్లో అందజేయాలి. ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల […]

నేటి నుంచి వైఎస్సార్ చేయూత దరఖాస్తులు స్వీకరణ
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 9:40 AM

వైఎస్సార్ చేయూత పథకం దరఖాస్తులను నేటి నుంచి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కేంద్రాల్లో స్వీకరించనున్నట్లు డీటీసీ మీరా ప్రసాద్ వెల్లడించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు, యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత పథకం కింద రూ. 10 వేల అర్థిక సహాయాన్ని అందించనుంది. అయితే దీనికి సంబంధించిన దరఖాస్తులను పూర్తి చేసి రవాణా శాఖ కార్యాలయాల్లో అందజేయాలి. ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 30న గ్రామ వాలంటీర్లు.. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత.. వాటిని ఉన్నతాధికారులకు అందజేస్తారని తెలిపారు. అక్టోబరు 1న లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు.

అక్టోబరు 4న సీఎం జగన్ చేతుల మీదుగా అర్థిక సహాయం అందిస్తారని డీటీసీ మీరా ప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాలు, ఈ-సేవా, మీ-సేవా కేంద్రాలు, సీఎస్సీ సెంటర్లలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని.. దరఖాస్తు ధర రూ. 50 మాత్రమే అని తెలిపారు. అంతకుమించి ఎక్కువ డబ్బులు ఎవరైనా డిమాండ్‌ చేస్తే.. తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. కాగా, ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది డ్రైవర్లు, వాహన యజమానులు లబ్ధి పొందనున్నారు. వస్తువులను రవాణా చేసే వాహన యజమానులు ఈ పథకానికి అర్హులు కాదని తెలిపారు. ఇవాళ, రేపు సెలవు రోజులైనప్పటికీ.. అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఆధార్‌ కార్డు, తెల్ల రేషన్‌ కార్డు, వెహికిల్ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను దరఖాస్తుతోపాటు జత చేయాలన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కుల ధ్రువీకరణ పత్రాలను జత చేయాలని తెలిపారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..