AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి

ఏపీలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా ఏర్పాటు అయిన డ్వాక్రా గ్రూపుల అకౌంట్లో రూ.15 వేలు జమ చేసింది. ఒక్కో గ్రూపుకు రూ.15 వేలు అందించింది. వీటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పొదుపు కోసం మహిళలు వినియోగించుకోవచ్చు.

Andhra News: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
Dwacra Womens
Venkatrao Lella
|

Updated on: Dec 17, 2025 | 6:14 PM

Share

Dwcra Women: ఏపీలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు ఆర్ధిక సహాయం అందించింది. అందులో భాగంగా ఒక్కొ గ్రూపు అకౌంట్‌లో రూ.15 వేలు జమ చేసింది. రివాల్వింగ్ ఫండ్ కింద దాదాపు 2 వేల డ్వాక్రా గ్రూపులకు రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను మంజూరు చేసింది. ఒక్కొ సంఘానికి రూ.15 వేల చొప్పున వారి గ్రూప్ అకౌంట్లో వీటిని జమ చేసింది. 2024 అగస్ట్ 2 నుంచి 2025 నవంబర్ 30 మధ్యలో కొత్తగా మహిళలు ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా గ్రూపులకు వీటిని అందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

డ్వాక్రా గ్రూపు సభ్యులు ఈ రూ.15 వేల రివాల్వింగ్ ఫండ్‌ను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. గ్రూప్ అకౌంట్‌లో డబ్బులు ఉండటం వల్ల వారి సంఘం నిధి పెరుగుతోంది. అంతేకాకుండా బ్యాంకులు వారికి త్వరగా రుణాలు ఇవ్వడానికి వీలుపడుతుంది. అకౌంట్‌లో డబ్బులు ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో డ్వాక్రా మహిళలు లోన్ పొందవచ్చు. అలాగే డ్వాక్రా మహిళలు వీటిని పొదుపు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో లాభం జరగనుంది.

డ్వాక్రా మహిళలకు రుణాలు

అటు ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణులు మంజూరు చేయిస్తోంది. స్త్రీ నిధి, విద్యాలక్ష్మి పేరుతో లోన్లు మంజూరు చేస్తుంది. ఇక డ్వాక్రా మహిళలకు వాయిదాల చెల్లింపులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మన డబ్బులు-మన లెక్కలు అనే యాప్ కూడా కొత్తగా లాంచ్ చేసింది. ఇలా డ్వాక్రా మహిళల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం తొడ్పాటు అందిస్తుంది.