Cold Wave: మంచు దుప్పటి కప్పుకున్న మన్యం.. పాడేరులో12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
మిచౌంగ్ తుఫాన్ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది. తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపించకపోగా, మంచు దుప్పటి కమ్మేస్తోంది.
మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది. చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏం ఉందో కనిపించడం లేదు. దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. మిచౌంగ్ తుఫాన్ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది. తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపించకపోగా, మంచు దుప్పటి కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అరకులో 13, చింతపల్లిలో 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగలైనా సరే, వాహనం బయటకు తియ్యాలంటే లైట్లు ఆన్ చెయ్యాల్సిందే. ఇక ముంచంగిపుట్టులో చలి తీవ్రతకు జనం చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. క్రమంగా ఉష్ణోగ్రతలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతోంది. దీంతో కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
ఇక ముంచంగిపుట్టు మండల పరిధిలో గత మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం పూట పది గంటల వరకు ముంచంగిపుట్టులో మంచు తెరలు వీడడం లేదు. చలికి జనం గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత వీధుల్లో చలి మంటలు దర్శనమిస్తున్నాయి.
చలిగాలులు..
Synoptic features of weather inference of Andhra Pradesh dated 14.12.2023 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/FyWmrM7zRY
— MC Amaravati (@AmaravatiMc) December 14, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..