Visakhapatnam: భార్య మృతికి కారణమైన భర్త.. కోర్టు ఏ శిక్ష విధించిందో తెలుసా?

ఊరు కాని ఊరు పొట్ట కూటి కోసం తరలివెళ్లారు. హైదరాబాద్, ఒంగోలు, విశాఖలలోనూ జీవనోపాధి కోసం తిరిగారు. ఇంతలో భర్త తాగుడుకు బానిస అయ్యాడు. భార్యను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. అప్పటికే కట్నం సమర్పించుకొని వివాహం చేసుకున్న ఆమె.. అదనపు కట్నం తేలేక, భర్త వేధింపులు తాళలేక విసుగెత్తి పోయింది. చివరకు ఏం జరిగిందంటే..ప్రకాశం జిల్లా రౌతు పల్లి గ్రామానికి చెందిన రవి.. మార్తమ్మ అనే మహిళతో 2005లో వివాహమైంది. కుటుంబ సభ్యులు కట్నం, సారే ఇచ్చి వివాహం..

Visakhapatnam: భార్య మృతికి కారణమైన భర్త.. కోర్టు ఏ శిక్ష విధించిందో తెలుసా?
Visakhapatnam Crime
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Srilakshmi C

Updated on: Dec 13, 2023 | 9:38 PM

విశాఖపట్నం, డిసెంబర్‌ 13: ఊరు కాని ఊరు పొట్ట కూటి కోసం తరలివెళ్లారు. హైదరాబాద్, ఒంగోలు, విశాఖలలోనూ జీవనోపాధి కోసం తిరిగారు. ఇంతలో భర్త తాగుడుకు బానిస అయ్యాడు. భార్యను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. అప్పటికే కట్నం సమర్పించుకొని వివాహం చేసుకున్న ఆమె.. అదనపు కట్నం తేలేక, భర్త వేధింపులు తాళలేక విసుగెత్తి పోయింది. చివరకు ఏం జరిగిందంటే..ప్రకాశం జిల్లా రౌతు పల్లి గ్రామానికి చెందిన రవి.. మార్తమ్మ అనే మహిళతో 2005లో వివాహమైంది. కుటుంబ సభ్యులు కట్నం, సారే ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో బంగారం కూడా ఇచ్చారు. కొంతకాలం పాటు కాపురం సజావుగా సాగిన.. ఆ తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు పడిన రవి భార్యను వేధించడం ప్రారంభించాడు. అదనపు కట్నం కోసం టార్చర్ పెట్టేవాడు.

ఆ తర్వాత ఉపాధి కోసం దంపతులిరువురు హైదరాబాద్ వెళ్ళిపోయారు. మళ్లీ ఒంగోలు, ఆ తర్వాత విశాఖ కు మకాం మార్చారు. విశాఖ కొబ్బరితోట ప్రాంతంలో.. రవి, మార్తమ్మ దంపతులు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన రవి.. భార్యను నిత్యం వేధిస్తూ ఉండేవాడు. పుట్టినరోజు నాడు అదనపు కట్నం తీసుకురమ్మని టార్చర్ పెట్టాడు. భర్త వేధింపులకు భార్య మార్తమ్మ తాళలేక పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు గోడు విన్నవించుకుంది. వారు కొంత డబ్బు ఇచ్చి కాపురానికి పంపారు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాలేదు. 2008 మార్చి 29న మళ్లీ భార్యతో ఘర్షణ పడ్డాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మార్తమ్మ.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలై ప్రాణాల కోల్పోయింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. దీంతో మార్తమ్మ మృతికి భర్త వేధింపులే కారణమని కోర్టు నమ్మింది. కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. మరో రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు. జరిమానా చెల్లించని పక్షంలో రెండు నెలల సాధారణ శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.