AP Congress: వై నాట్ ఆంధ్రప్రదేశ్.. యాక్టివ్ మోడ్‌లోకి కాంగ్రెస్.. త్వరలోనే రూట్ మ్యాప్..
గ్రౌండ్ రియాల్టీ ఎలా వున్నా పొరుగు విజయాలే ప్రాయర్టీగా ఏపీ కాంగ్రెస్ కదనోత్సహ కదలిక వచ్చింది. కర్నాటక, తెలంగాణలో గెలుపును ప్రొజెక్ట్ చేస్తూ ఏపీలో ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేలా వ్యూహాలకు పదను పెడుతోంది. బెజవాడలో మేథోమథనం ఘట్టం జరిగింది. స్పెషల్ స్టేటస్ గ్యారెంటీగా ప్రచారబెల్ మోగించాలని డిసైడయ్యారు ఏపీ కాంగ్రెస్ నేతలు.. మార్పుకావాలి.. కాంగ్రెస్ రావాలి.. ఈ నినాదం వర్కవుటయింది.
గ్రౌండ్ రియాల్టీ ఎలా వున్నా పొరుగు విజయాలే ప్రాయర్టీగా ఏపీ కాంగ్రెస్ కదనోత్సహ కదలిక వచ్చింది. కర్నాటక, తెలంగాణలో గెలుపును ప్రొజెక్ట్ చేస్తూ ఏపీలో ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేలా వ్యూహాలకు పదను పెడుతోంది. బెజవాడలో మేథోమథనం ఘట్టం జరిగింది. స్పెషల్ స్టేటస్ గ్యారెంటీగా ప్రచారబెల్ మోగించాలని డిసైడయ్యారు ఏపీ కాంగ్రెస్ నేతలు.. మార్పుకావాలి.. కాంగ్రెస్ రావాలి.. ఈ నినాదం వర్కవుటయింది. తెలంగాణలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో కొలువు దీరింది. ఈ తరుణంలో ఈ నినాదమే తమ విధానంగా ఏపీ కాంగ్రెస్ వ్యూహాలకు పదను పెడుతోంది. కర్నాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్. ఇప్పడు తెలంగాణ గెలుపుతో ఇక ఏపీలో లైమ్‌లైట్‌లోకి వచ్చేలా కాంగ్రెస్ రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. మేథోమథన ప్రక్రియ చేపట్టింది. పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అధ్యక్షతన విజయవాడలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ సీనియర్స్ రఘువీరా, జేడీ శీలం, పల్లం రాజు తదతర నేతలు చర్చోపచర్చలు జరిపారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం సహా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించారు. కర్నాటక, తెలంగాణలో గెలుపు పిలుపే బూస్టుగా వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మళ్లీ పూర్వవైభవం సాధించాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటనలు, బాధితుల పరామర్శలతో ఏపీ కాంగ్రెస్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది.
ఈ నెల తొమ్మిదితో గిడుగు రుద్రరాజు APCC అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదయిన సందర్భంగా యాక్టివిటీ రిపోర్టు అందజేశారు గిడుగు రుద్రరాజు. ఎన్నికల ప్రణాళిక, మ్యానిఫెస్టో రూపకల్పన, విధానపరమైన నిర్ణయాలపై ఏపీ కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో అనుసరించిన మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికలకు వెళ్లాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మీటింగ్ తీసుకున్న నిర్ణయాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారు. త్వరలోనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం అవుతామని గిడుగు రుద్రరాజు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఓ యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్లాలని సమావేశం నిర్ణయించింది.
కర్నాటకలో ఐదు గ్యారెంటీలు.. తెలంగాణలో ఆరు.. మరి ఏపీలో ఎన్ని గ్యారెంటీలు? సింబాలిక్‌గా ఏడు హామీలుంటాయా? ఒకటి ఎక్కువే ఉంటుంది కానీ తగ్గేదేలేదంటోంది ఏపీ కాంగ్రెస్. ప్రత్యేక హోదా ప్రధాన హామీగా ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి సిద్ధమవుతోంది.
During the Political Affairs Committee meeting, the Andhra Pradesh Congress Committee condemned the major security breach and attack on the Parliament this afternoon. pic.twitter.com/IhoOxnIHZH
— INC Andhra Pradesh (@INC_Andhra) December 13, 2023
త్వరలో ఏపీలో రాహుల్ , ప్రియాంక గాంధీ పర్యటిస్తారన్నారు. రాహుల్ నాయకత్వంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం.. ప్రియాంక సారథ్యంలో అమరవాతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు గిడుగు రుద్రరాజు. గత ఎన్నికల్లో టీడీపీకి బై బై అంటూ ప్రచారం చేసిన షర్మిల ఈసారి ఏపీ కాంగ్రెస్‌లో స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి