AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ప్రేమ పేరుతో ఉన్మాది దారుణం.. మధ్యాహ్నం వేళ యువతి ఇంట్లోకి చొరబడి..

విశాఖ మధురవాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. స్వయంకృషి నగర్‌లో అమ్మాయి, ఆమె తల్లిపై దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. కుమార్తెకు తీవ్రగాయలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సడెన్‌గా ఇంట్లోకి చొరబడి అమ్మాయి, ఆమె తల్లిపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు.

Andhra News: ప్రేమ పేరుతో ఉన్మాది దారుణం.. మధ్యాహ్నం వేళ యువతి ఇంట్లోకి చొరబడి..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2025 | 5:43 PM

Share

విశాఖపట్నం మధురవాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. స్వయంకృషి నగర్‌లో ఓ ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.. ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు.. అమ్మాయి, ఆమె తల్లిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. కుమార్తెకు తీవ్రగాయలయ్యాయి. ప్రేమను నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.. బుధవారం మధ్యాహ్నం.. సడెన్‌గా ఇంట్లోకి చొరబడిన యువకుడు.. అమ్మాయి, ఆమె తల్లిపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

డిగ్రీ చదువుకొని ఇంట్లోనే ఉంటోన్న యువతిని నవీన్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.. తనను ప్రేమించాలని వెంటపడుతున్నాడు.. ఆ యువతి నిరాకరించడంతో నవీన్‌ ఈ దాడి చేసినట్లు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పలు బృందాలు రంగంలోకి దింపి పట్లుకున్నారు.

నిందితుడు నవీన్‌ను పట్టుకున్నట్లు సీపీ బాగ్చి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. చాలా దురదృష్టకర ఘటన.. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఘటన జరిగిందన్నారు. యువతి పరిస్థితి నిలగడగా ఉందని తెలిపారు. నిందితుడు డిగ్రీ చదివాడని .. ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాలకు తెలుసని తెలిపారు. పెళ్లి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారని.. తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదని తెలిపారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

ఏపీ హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి..

ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబత్ర బాగ్చితో ఫోన్‌లో మాట్లాడి.. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రేమోన్మాదిని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.

తల్లీకూతుళ్లపై ప్రేమోన్మాది దాడితో స్వయంకృషి నగర్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది.. అయితే.. ఈ ఘటనలో యువతి కూడా మరణించినట్లు వార్తలు రావడంతో దీనిపై ఏసీపీ అప్పలరాజు స్పందించారు.. యువతికి చికిత్స జరుగుతోందని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..