Fancy Number Plates: బైక్‌, కార్లకు ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ వేస్తున్నారా? జరిమానాతోపాటు జైలు శిక్ష

బైకులు, కార్లపై మీకు నచ్చిన విధంగా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ పెట్టుకుంటున్నారా? అయితే నడిరోడ్డు మీద మీ వాహనాన్ని ఆపి పోలీసులు సీజ్ చేయొచ్చు. మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్స్ వినియోగించుకోకపోతే మీ జేబు ఖాళీ అవ్వడం ఖాయం. విజయనగరం జిల్లాలో కార్లు, మోటార్ సైకిల్స్ పై గజిబిజిగా, గందరగోళంగా ఉన్న నెంబర్ ప్లేట్స్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కొరడా జులిపించారు ట్రాఫిక్ పోలీసులు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేపట్టి వాహనాల పై ఉన్న..

Fancy Number Plates: బైక్‌, కార్లకు ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ వేస్తున్నారా? జరిమానాతోపాటు జైలు శిక్ష
Traffic Police
Follow us
G Koteswara Rao

| Edited By: Srilakshmi C

Updated on: Oct 12, 2023 | 5:23 PM

విజయనగరం, అక్టోబర్ 12: బైకులు, కార్లపై మీకు నచ్చిన విధంగా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ పెట్టుకుంటున్నారా? అయితే నడిరోడ్డు మీద మీ వాహనాన్ని ఆపి పోలీసులు సీజ్ చేయొచ్చు. మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్స్ వినియోగించుకోకపోతే మీ జేబు ఖాళీ అవ్వడం ఖాయం. విజయనగరం జిల్లాలో కార్లు, మోటార్ సైకిల్స్ పై గజిబిజిగా, గందరగోళంగా ఉన్న నెంబర్ ప్లేట్స్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కొరడా జులిపించారు ట్రాఫిక్ పోలీసులు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేపట్టి వాహనాల పై ఉన్న ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ ను అక్కడిక్కడే తొలగించి జరిమానాలు విధించారు. ఆన్ లైన్ చలానా లో చెక్ చేసి మరీ మొదటిసారి తప్పు చేస్తే జరిమానాతో వదిలేశారు. అది కాకుండా రెండో సారి కూడా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ వినియోగించిన నెంబర్ ప్లేట్స్ ను సీజ్ చేశారు. ఇటీవల ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ కారణంగా అటు పబ్లిక్ తో పాటు ఇటు పోలీసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎక్కడైనా ప్రమాదం జరిగితే అందుకు కారణమైన వాహనాలపై ఉన్న ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ వల్ల ఆయా వాహనాలను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగానే మారుతుంది. నెంబర్ ప్లేట్ గందరగోళంగా ఉండటంతో బైక్ ను గుర్తించడం కష్టతరంగా మారుతుంది. ఇటీవల బైక్ రేసర్స్, చైన్ స్నాచర్లు విపరీతంగా పెరిగిపోవడంతో బైక్ పై వెళ్తున్న వారిని పట్టుకోవడం పోలీసులకు ఇబ్బందిగా మారుతుంది. దీంతో పారదర్శకత లేని నెంబర్ ప్లేట్స్ వాడుతున్న వాహనదారుల పై చర్యలకు దిగారు ట్రాఫిక్ పోలీసులు. జిల్లా వ్యాప్తంగా ఈ నెంబర్ ప్లేట్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో గత కొన్నాళ్లుగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుతం పెరిగిన నేరాల దృష్ట్యా ఈ డ్రైవ్ చేపట్టినట్టు చెబుతున్నారు అధికారులు. అయితే మొదటిసారి ఫ్యాన్సి నెంబర్ ప్లేట్ తో దొరికితే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు బండి నెంబర్ ప్లేట్స్ తీసి పంపిస్తున్నారు.

అదే రెండో సారి పట్టుబడితే వాహనాలు సీజ్ చేసి ఆర్టీవో ఆఫీస్ కి అప్పగించడం లేదా కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపడం చేస్తున్నారు. పోలీసులు వెయ్యి రూపాయలు ఫైన్ వేసి వదిలేస్తే న్యాయస్థానంలో మాత్రం చర్యలు కొంత కఠినంగానే ఉంటాయి. రెండు వేల రూపాయల ఫైన్, నాలుగు నుంచి ఐదు రోజుల పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాహనదారులు తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ ఖచ్చితంగా మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఉండే నెంబర్ ప్లేట్స్ ను వినియోగించాలని సూచిస్తున్నారు. అలా లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.