TTD: తిరుమలలో వసతి సమస్య పరిష్కారానికి టీటీడీ వినూత్న ఆలోచన..

తిరుమల కొండకు భక్తుల రద్దీ రోజు రోజూ కీ పెరుగుతోంది. తిరుమల కొండకు చేరే భక్తుల అవసరాలకు తగ్గట్టు వసతి సౌకర్యం కల్పించేందుకు టీటీడీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. వీవీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు వసతి కల్పించేందుకు గెస్ట్ హౌస్ లు, కాటేజీలు, పిలిగ్రిమ్స్ ఎమినిటీస్ సెంటర్స్ ను అందుబాటులో తెచ్చింది...

TTD: తిరుమలలో వసతి సమస్య పరిష్కారానికి టీటీడీ వినూత్న ఆలోచన..
Tiriumala
Follow us
Raju M P R

| Edited By: Narender Vaitla

Updated on: Jul 28, 2023 | 2:00 AM

తిరుమల కొండకు భక్తుల రద్దీ రోజు రోజూ కీ పెరుగుతోంది. తిరుమల కొండకు చేరే భక్తుల అవసరాలకు తగ్గట్టు వసతి సౌకర్యం కల్పించేందుకు టీటీడీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. వీవీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు వసతి కల్పించేందుకు గెస్ట్ హౌస్ లు, కాటేజీలు, పిలిగ్రిమ్స్ ఎమినిటీస్ సెంటర్స్ ను అందుబాటులో తెచ్చింది. తిరుమలలో మొత్తం 7500 అన్ని రకాల గదులు అందుబాటులో ఉండగా అందులో దాదాపు 300 కు పైగా టీటీడీతో పాటు ఇతర శాఖల అవసరాల కోసం వినియోగం లో ఉన్నాయి. దీంతో 7200 వరకు గదులు మాత్రమే భక్తులు వసతి పొందేందుకు అవకాశం ఉండగా, 4 పీఏసీ సెంటర్ల లో భక్తులు వసతి పొందేందుకు అవకాశం ఉంది. ఈ లెక్కన దాదాపు 40 వేల నుంచి 45 వేల మంది భక్తులు రోజు తిరుమలలో వసతికి అవకాశం ఉండగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య రోజు సగటున 70 వేల నుంచి 80 వేల వరకు ఉంటుంది.

అంటే దాదాపు సగం మంది భక్తులకు తిరుమలలో వసతి కష్టం ఎదురవుతోంది. భక్తులు రోజు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు టిటిడి పరిష్కారం చూపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కొత్త ఆలోచనను తెర మీదికి తెచ్చింది. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటోంది. కాంక్రీట్ జంగిల్ కాకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. తిరుమలలో కొత్త నిర్మాణాలకు అనుమతులు లేవన్న నిర్ణయాన్ని అమలు చేస్తోంది. దీంతో తిరుమలలో ఎలాంటి కొత్త నిర్మాణాలకు అవకాశం లేకపోగా పాత విశ్రాంతి గృహాలను పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురా గలుగుతున్న టీటీడీ భక్తులకు కొరతగా ఉన్న వసతి సమస్యను మాత్రం పూర్తి స్థాయిలో పరిష్కరించలేక పోతోంది.

టీటీడీ కొత్త ఆలోచన..

ఈ నేపథ్యంలో కొత్త నిర్మాణాలు చేపట్టలేక కొత్త ఆలోచనకు తెర తీసింది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో తాత్కాలికంగా బస కల్పించేందుకు విశాఖపట్నం కు చెందిన మూర్తి అనే దాత విరాళంగా అందజేసిన రెండు మొబైల్ కంటైనర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తో కలిసి మొబైల్ కంటైనర్లను ప్రారంభించగా జీఎన్సీ వద్ద, టీటీడీ ట్రాన్స్‌ పోర్ట్‌ డిపోలో డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు ఈ రెండు కంటైనర్లను టిటిడి అందుబాటులో ఉంచింది. మొబైల్ కంటైనర్లలో భక్తులు బస చేసేందుకు వీలుగా పరుపులు, స్నానపు గది, మరుగుదొడ్లు ఉండగా ఒక్కో కంటైనర్ విలువ రూ 25 లక్షల మేర ఉంటుందని టిటిడి చెబుతోంది. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ కంటైనర్లను టిటిడి వినియోగించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..