Blue Whale: సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన బ్లూ వేల్ డెడ్ బాడీ .. సెల్ఫీల కోసం ఎగబడిన జనం..
భారీ పరిమాణంతో చూడటానికి వింత జీవిలా ఉండటంతో ఈ నీలి తిమంగళంను చూసేందుకు పెద్ద సంఖ్యలో చుట్టూ పక్క గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు. నీలిరంగు తో ఆహ్లాదకరంగా కనిపించే సముద్రం అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా అల్లకల్లోలంగా ఉంది.
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో కురుస్తోన్న భారీ వర్షాలకు జనాలు పండుటాకుల్లా వణికిపోతున్నారు. అటు సముద్రం జీవరాసులు సైతం అల్లాడిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లోని పాత మేఘవరం – డి.మరువాడ సముద్రతీరాల మద్యకు గురువారం సాయంత్రం భారీ నీలి తిమంగళం కొట్టుకువచ్చింది. చూడటానికి ఇది సుమారు 25 అడుగుల పొడవు,ఐదు టన్నులు బరువు ఉంది. ఇది మృతి చెంది ఉంది. ఈ నీలి తిమంగళంను బ్లూ వేల్ అంటారని మత్స్యకారులు చెబుతున్నారు. భారీ పరిమాణంతో చూడటానికి వింత జీవిలా ఉండటంతో ఈ నీలి తిమంగళంను చూసేందుకు పెద్ద సంఖ్యలో చుట్టూ పక్క గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు. నీలిరంగు తో ఆహ్లాదకరంగా కనిపించే సముద్రం అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ క్రమంలోనే నిలి తిమింగలం చనిపోయి ఉంటుందని మత్స్యకారులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..