Tomato Price: వామ్మో టమాటా.. సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తుందే. ఇంతకీ కారణం ఏంటంటే.

టమాట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో టమాటను కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ నెల మొదటి వారంలో రూ. 15 నుంచి రూ. 20 మధ్య ఉన్న కిలో టమాట ధర, నెల మధ్యలో ఏకంగా రూ. 60 వరకు చేరుకుంది. ఇక తాజాగా అయితే ఏకంగా రూ. 80కి చేరుకుంది....

Tomato Price: వామ్మో టమాటా.. సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తుందే. ఇంతకీ కారణం ఏంటంటే.
Tamato Price
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 26, 2023 | 2:42 PM

టమాట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో టమాటను కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ నెల మొదటి వారంలో రూ. 15 నుంచి రూ. 20 మధ్య ఉన్న కిలో టమాట ధర, నెల మధ్యలో ఏకంగా రూ. 60 వరకు చేరుకుంది. ఇక తాజాగా అయితే ఏకంగా రూ. 80కి చేరుకుంది. దీంతో కొనుగోలుదారులు టమాట అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లోనూ టమాట ధరలు పెరగడం తప్ప తగ్గే అవకాశం లేదని అంచాన వేస్తున్నారు. త్వరలోనే కేజీ టమాట రూ. 100 దాటడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఒక్కసారిగా టమాట ధర ఇంతల పెరగడానికి సరఫరా లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం వల్లే టమాట ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడానికి కారణంగా తెలుస్తోంది. అయితే.. గత నెలలో మాత్రం టమాట ధరల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. టమాట ధర చాలా తక్కువగా ఉంది. దీంతో రైతులు మార్కెట్లలోనే టమాటను పడేశే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే కేవలం టమాట మాత్రమే కాకుండా ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో చిక్కుడు రూ. 90 పలకడం గమనార్హం. కర్నూలులో తాజాగా కిలో టమాట రూ. 80 పలకగా, చిక్కుడు రూ. 90 పలికింది. పచ్చిమిర్చి ధర కూడా మండిపోతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..