Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు క్రేజీ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్

వారానికి 5 రోజులు పని విధానాన్ని మరో ఏడాది పాటు పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సీఎంకు ధన్యవాదాలు తెలిపింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు క్రేజీ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్
Andhra CM Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 26, 2023 | 3:05 PM

ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే అందరికీ కాదండోయ్. కేవలం రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి మాత్రమే. అంటే.. హెచ్ఓడీ కార్యాలయాలు, సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ తదితర చోట్ల వర్క్ చేస్తున్న ఎంప్లాయిస్‌కు 5 రోజులు పనిచేసే విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ పనివేళలు ఉంటాయి.

గతంలో పొడిగించిన గడువు ఈనెల 27తో ముగియనుండటంతో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు సర్కార్ మరో సంవత్సరం పొడిగించింది. దీంతో సీఎం జగన్‌కు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2016లో తొలుత ఈ విధానాన్ని అప్పటి టీడీపీ సర్కార్ ప్రారంభించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చేందుకు అప్పుడు ప్రభుత్వం ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్