AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

మొన్నటివరకు ఎండలు.. ఇప్పుడు వానలే వానలు. అవును రుతుపవనాలకు అల్పపీడనం కూడా తోడయ్యింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో వర్షాలు పడుతున్నాయి. ఏపీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చింది.

AP Weather: ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..
Andhra Weather Report
Ram Naramaneni
|

Updated on: Jun 26, 2023 | 4:06 PM

Share

ఆదివారం నాడు ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం సోమవారం ఉత్తర అంతర్గత ఒడిశా, దక్షిణ జార్ఖండ్, ఉత్తర చత్తీస్ గఢ్‌లో కొనసాగుతూ దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టంనకు 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తర మధ్య ప్రదేశ్ వైపు వెళ్లే అవకాశముంది. ఇక ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పడమటి గాలులు వీస్తున్నాయి.

ఈ క్రమంలో వచ్చే 3 రోజులపాటు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన గాలులు గంటకు 30-40కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని వెల్లడించింది. ఇక నైరుతి రుతుపవనాల ప్రభావంతో.. పలు ప్రాంతాల్లో వానలు పడుతూనే ఉన్నాయి. రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో.. ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది. పల చోట్ల భారీ వర్షపాతం నమోదవుతుంది. దీంతో రైతులు విత్తనాలు వేసేందుకు రెడీ అయ్యారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి.

ఇక ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షం దంచికొడుతోంది. రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీతోపాటు నోయిడా, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌లో భారీ వర్ష పాతం నమోదైంది. ముంబైలో కూడా వర్షం దంచికొడుతోంది. IMD ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మరో మూడు నాలుగు గంటల్లో ముంబై, థానే, పాల్గర్‌లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిలాన్‌ సబ్‌ వేను మహారాష్ట్ర సీఎం షిండే పరిశీలించారు. ఏ సమస్య రాకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్